జయదేవ అష్టపది ప్రబంధః – 13 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
సప్తమః సర్గః – నాగర నారాయణః
అత్రాంతరే చ కులటా కుల వర్త్మ పాత
సంజాత పాతక ఇవ స్ఫుట లాంచన శ్రీః ।
బృందావనాంతర మదీపయ దంశు జాలైః
దిక్సుందరీ వదన చందన బిందురిందుః ॥ 1 ॥
ప్రసరతి శశ ధర బింబే
విహిత విలంబే చ మాధవే విధురా ।
విరచిత వివిధ విలాపం
సా పరితాపం చకారోచ్చైః ॥ 2॥
॥ ప్రబంధః – 13 ॥
(నాగర నారాయణ రాసావలయః)
(మాళవ – యతి) (ఆహిరి – జంపె)

మాలవరాగ యతి తాళాభ్యాం గీయతే ।
కథిత సమయేఽపి హరిరహహ న యయౌ వనం ।
మమ విఫలమిద మమలరూపమపి యౌవనమ్ ॥
యామి హే! కమిహ శరణం
సఖీ జన వచన వంచితాఽహమ్ ॥ (ధ్రువమ్) ॥
యదనుగమనాయ నిశి గహనమపి శీలితం ।
తేన మమ హృదయమిద మసమశర కీలితమ్ ॥
మమ మరణమేవ వరమితి వితథ కేతనా ।
కిమిహ విషహామి విరహానల మచేతనా ॥
మా మహహ! విధురయతి మధుర మధు యామినీ ।
కాపి హరిమనుభవతి కృత సుకృత కామినీ ॥
అహహ! కలయామి వలయాది మణి భూషణం ।
హరి విరహ దహన వహనేన బహు దూషణమ్ ॥
కుసుమ సుకుమార తను మతనుశర లీలయా ।
స్రగపి హృది హంతి మా మతివిషమ శీలయా ॥
అహమిహ హి నివసామి న విగణిత వేతసా ।
స్మరతి మధుసూదనో మామపి న చేతసా ॥
హరి చరణ శరణ జయదేవ కవి భారతీ ।
వసతు హృది యువతిరివ కోమల కలావతీ ॥
తత్కిం కామపి కామినీమభిసృతః! కిం వా కలా కేళిభిః
బద్ధో బంధుభి! రంధకారిణి వనాభ్యర్ణే కిముద్భ్రామ్యతి ।
కాంతః క్లాంతమనా మనాగపి పథి ప్రస్థాతుమేవాక్షమః!
సంకేతీకృత మంజువంజుళ లతా కుంజేఽపి యన్నాగతః ॥ 3॥
అథాగతాం మాధవమంతరేణ
సఖీమియం వీక్ష్య విషాద మూకాం ।
విశంకమానా రమితం కయాఽపి
జనార్దనం దృష్టవ దేత దాహ ॥ 4 ॥
భావము:
ఆ రాధ చంద్రబింబం చకచక ఉదయిస్తూ ఉండగా చూసి, కృష్ణుడు తొందరగా రాకుండా ఆలస్యం చేస్తుండటానికి ఎంతో దుఃఖించి మిక్కిలిసంతాపాన్ని పొందింది.
రాధ హృదయ వేదనను చెలికత్తె కృష్ణునికి వివరించే సమయంలోనే చంద్రోదయమైంది. చంద్రోదయం కావడం వల్ల రహస్యంగా సంగమించడం కుదరని పని. శ్రీకృష్ణుడు ఇంకా తనవద్దకు చేరనందుకు రాధ బాధ పెరిగింది. “చెప్పిన సమయానికి శ్రీహరి నా వద్దకు రాలేదు. కనుక నా వయసు, సొగసు వృథా అయినట్లేనా? నా సఖి వల్ల కూడా నేను వంచించబడ్డాను. ఇపుడు నేను ఎవరిని శరణు వేడాలి? నా స్వామి నా చెంత లేకపోవడంతో మన్మథ బాణాలు నన్ను వేధిస్తున్నాయి. శ్రీకృష్ణుడు లేకుండా ఎలా ఈ విరహబాధను సహించగలను? మరణమే నాకిక శరణ్యం. మధురాతి మధురమైన ఈ వసంత రాత్రి నన్ను తీవ్రంగా బాధిస్తోంది. ఎంతో పుణ్యం చేసుకొన్న మరియొక స్త్రీ శ్రీహరితో ఆనందిస్తున్నది.
హరి విరహాగ్నిలో మండిపోతున్న నాకు ఈ మణిభూషణాలతో పని లేదు. వృక్షాల మాటున గల ఈ పొదరింట్లో నేను విరహంతో ఉన్నాను. నా కృష్ణుడు మనోహరమైన ఈ సంకేత స్థలానికి వస్తానని చెప్పి ఎందుకు రావడంలేదు? శ్రీకృష్ణుడు వేరొక కామినితో విహరిస్తున్నాడా? బంధువులైన గోపాంగనల రాసక్రీడల్లో చిక్కుకుపోయాడా? మైమరచి ఈ చీకటి కీకారణ్యంలో సంచరిస్తున్నాడా? నా వియోగబాధను తట్టుకోలేక నడువలేక పోతున్నాడా?” అని తలచింది. ఇంతలో రాధ చెలికత్తె శ్రీకృష్ణుని దగ్గరనుండి వచ్చి, విషాదంతో ఏమీ సమాధానమివ్వకుండా ఉండటం చూసి, రాధ, “ఓహో! శ్రీకృష్ణుడు అన్యకాంతాసక్తుడై ఉండవచ్చు. లేకుంటే, నా చెలికత్తె ఇలా దుఃఖాన్ని పొందటానికి కారణమేమై ఉంటుంది? అని ఊహించి ఈ ప్రకారంగా చెప్పసాగింది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
జయదేవుని అష్టపదులు
ప్రథమః సర్గః – సామోద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్
ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః
జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్
తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః
పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః
జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః
షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః
జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్

సప్తమః సర్గః – నాగర నారాయణః
జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః
అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః
జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ
నవమః సర్గః – ముగ్ధ ముకుందః
జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

దశమః సర్గః – చతుర చతుర్భుజః
జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః
ఏకాదశః సర్గః – సానంద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః
జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









