జయదేవ అష్టపది ప్రబంధః – 9 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
॥ ప్రబంధః – 9 ॥
(స్నిగ్ధ మధుసూదన రాసావలయః)
(దేసాక్షరీ – ఏక)

దేశాఖ్య రాగైక తాళీ తాళాభ్యాం గీయతే ।
స్తన వినిహితమపి హారముదారం ।
సా మనుతే కృశా తనురివ భారమ్ ॥
రాధికాకృష్ణ! రాధికా
రాధికా తవ విరహే కేశవ! ॥ (ధ్రువమ్) ॥
సరస మసృణమపి మలయజ పంకం ।
పశ్యతి విషమివ వపుషి సశంకమ్ ॥
శ్వసిత పవనమనుపమ పరిణాహం ।
మదన దహనమివ వహతి సదాహమ్ ॥
దిశి దిశి కిరతి సజల కణజాలం ।
నయన నళినమివ విగళితనాళమ్ ॥
నయన విషయమపి కిసలయ తల్పం ।
కలయతి విహిత హుతాశ వికల్పమ్ ॥
త్యజతి న పాణి తలేన కపోలం ।
బాల శశినమివ సాయమలోలమ్ ॥
హరిరితి హరిరితి జపతి సకామం ।
విరహ విహిత మరణేన నికామం ॥
శ్రీ జయదేవ భణితమితి గీతం ।
సుఖయతు కేశవ పదముపనీతమ్ ॥
సా రోమాంచతి సీత్కరోతి విలపత్యుత్కంపతే తామ్యతి
ధ్యాయత్యుద్భ్రమతి ప్రమీలతి పతత్యుద్యాతి మూర్ఛత్యపి ।
ఏతావత్యతను జ్వరే వర తనుర్జీవేన్న కిం తే రసాత్
స్వర్వైద్యప్రతిమ! ప్రసీదసి యది త్యక్తోఽన్యథా హస్తకః ॥ 3॥
స్మరాతురాం దైవత వైద్య హృద్య!
త్వదంగ సంగామృత మాత్ర సాధ్యామ్ ।
నివృత్త బాధాం కురుషే న రాధామ్
ఉపేంద్ర! వజ్రాదపి దారుణోఽసి ॥ 4 ॥
కందర్ప జ్వర సంజ్వరాతుర తనోరాశ్చర్యమస్యాశ్చిరం
చేతశ్చందన చంద్రమః కమలినీ చింతాసు సంతామ్యతి ।
కింతు క్లాంతి వశేన శీతల తరం త్వామేకమేవ ప్రియం
ధ్యాయంతీ రహసి స్థితా కథమపి క్షీణా క్షణం ప్రాణితి ॥ 5 ॥
క్షణమపి విరహః పురా న సేహే
నయన నిమీలన ఖిన్నయా యయా తే ।
శ్వసితి కథమసౌ రసాల శాఖాం
చిర విరహేణ విలోక్య పుష్పితాగ్రామ్ ॥ 6॥
వృష్టి వ్యాకుల గోకులావన రసాదుద్ధృత్య గోవర్ధనం
బిభ్రద్వల్లవ వల్లభాభి రధికానందాచ్చిరం చుంబితః ।
దర్పేణైవ తదర్పితాధర తటీ సిందూర ముద్రాంకితో
బాహుర్గోపతనో స్తనోతు భవతాం శ్రేయాంసి కంస ద్విషః ॥ 7 ॥
ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే
స్నిగ్ధ మధుసూదనోనామ చతుర్థస్సర్గః॥
భావము:
రాధ ఛీత్మారంతో విలపిస్తోంది. వణుకుతోంది. నీ ధ్యాసతోనే బాధపడుతోంది. ఏవేవో నీ శృంగార చేష్టలు గుర్తుకు వచ్చి కళ్ళు మూసుకుంటోంది. శరీరం బలహీనమై, కృంగిపడిపోతుంది. మళ్ళీ మెల్లగా లేస్తోంది. దేవతా సమానుడవైన శ్రీకృష్ణా! నీవు మన్మథ స్వరంతో ప్రసన్నుడవైతే, ఆ సౌందర్యరాశి రాధ నీ శృంగార కేళిలో జీవించదా? నీ కృప లేకపోతే రాధ సర్వశక్తులు కోల్పోగలదు. ఇప్పటికైనా నీవు ఆమె పట్ల ప్రసన్నుడవు కాకపోతే, నీ కంటె కఠినాత్ముడైన యముడు మరొకడుండడు.
కామజ్వర శరీరం గల రాధ మనస్సుకు నీవు తప్ప చందనం, చంద్రుడు, తామరతీగెలు శీతలత్వాన్ని ఇవ్వలేవు. కృష్ణా! పూర్వం నీవు, రాధ కలసిమెలిసి ఉన్నప్పుడు కూడా కనురెప్పపాటులో ప్రాప్తించే నీ విరహాగ్నినే ఆమె భరించ గలిగేది కాదు. అట్టి రాధ ఈ వసంత హేలను ఎలా ఆస్వాదించి జీవించగలదో చెప్పు. గోపాలా! మదనునిచేత బాధితురాలైన రాధకు నీ శరీర సాంగత్యమనే అమృత సేవనంతోనే ఆమె రోగ నివారణ సాధ్యం. రాధకు బాధ నుంచి విముక్తి కలిగించకపోతే నీవు వజ్రం కంటె కఠినుడవవుతావు” అని పలికింది.
శ్రీకృష్ణుడు రాధయొక్క సఖి తెల్పిన వృత్తాంతాన్ని విని, ఆమె చెలికత్తెను పంపుతూ నేనిక్కడే ఉంటాను, నీవు పోయి రాధను పిలుచుకొని రావలసిందని శ్రీకృష్ణుడు ఆజ్ఞాపించగా, రాధయొక్క చెలికత్తె ఆమె సన్నిధికి పోయి ఇలా విన్నవించింది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
జయదేవుని అష్టపదులు
ప్రథమః సర్గః – సామోద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్
ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః
జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్
తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః
పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః
జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః
షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః
జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్

సప్తమః సర్గః – నాగర నారాయణః
జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః
అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః
జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ
నవమః సర్గః – ముగ్ధ ముకుందః
జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

దశమః సర్గః – చతుర చతుర్భుజః
జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః
ఏకాదశః సర్గః – సానంద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః
జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









