జయదేవ అష్టపది ప్రబంధః – 20 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
ఏకాదశః సర్గః – సానంద దామోదరః
సుచిరమనునయేన ప్రీణయిత్వా మృగాక్షీం
గతవతి కృతవేశే కేశవే కుంజశయ్యాం ।
రచిత రుచిర భూషాం దృష్టి మోషే ప్రదోషే
స్ఫురతి నిరవసాదం కాఽపి రాధాం జగాద ॥ 1 ॥
॥ ప్రబంధః – 20 ॥
(శ్రీహరితాళరాజి జలధరవిలసితః)
(మోహన – ఆది) (కళ్యాణి – చాపు)

వసంత రాగ యతి తాళాభ్యాం గీయతే ।
విరచిత చాటు వచన రచనం చరణే రచిత ప్రణిపాతం ।
సంప్రతి మంజుళ వంజుళ సీమని కేళిశయన మనుయాతం ॥
ముగ్ధే! మధు మథన మనుగత మనుసర రాధికే ॥ (ధ్రువమ్) ॥
ఘన జఘన స్తన భార భరే దర మంథర చరణ విహారం ।
ముఖరిత మణి మంజీరముపైహి విధేహి మరాళ వికారమ్ ॥
శృణు రమణీయతరం తరుణీ జన మోహన మధురిపు రావం ।
కుసుమ శరాసన శాసన వందిని పిక నికరే భజ భావమ్ ॥
అనిల తరళ కిసలయ నికరేణ కరేణ లతా నికురుంబం ।
ప్రేరణమివ కరభోరు కరోతి గతిం ప్రతి ముంచ విలంబమ్ ॥
స్ఫురితమనంగ తరంగ వశాదివ సూచిత హరి పరిరంభం ।
పృచ్ఛ మనోహర హార విమల జల ధారమముం కుచ కుంభమ్ ॥
అధిగతమఖిల సఖీభిరిదం తవ వపురపి రతి రణ సజ్జం ।
చండి! రణిత రశనా రవ డిండిమ మభిసర సరస మలజ్జమ్ ॥
స్మర శర సుభగ నఖేన సఖీమవలంబ్య కరేణ సలీలం ।
చల వలయ క్వణితై రవబోధయ హరిమపి నిగదిత శీలం ॥
శ్రీ జయదేవ భణిత మధరీకృత హారముదాసిత వామం ।
హరి వినిహిత మనసా మధితిష్ఠతు కంఠతటీ మవిరామమ్ ॥
అక్ష్ణోర్నిక్షిపదంజనం శ్రవణయోస్తాపింఛ గుచ్ఛావలీం
మూర్ధ్ని శ్యామ సరోజ దామ కుచయోః కస్తూరికా పత్రకం ।
ధూర్తానామభిసర సంభ్రమ జుషాం విష్వఙ్నికుంజే సఖి!
ధ్వాంతం నీల నిచోళ చారు సుదృశాం ప్రత్యంగ మాలింగతి ॥ 2 ॥
కాశ్మీర గౌర వపుషా మభిసారికాణాం
ఆబద్ధ రేఖమభితో రుచి మంజరీభిః ।
ఏతత్తమాల దళ నీలతమం తమిస్రం
తత్ప్రేమ హేమ నికషోపలతాం తనోతి ॥ 3 ॥
హారావళీ తరళ కాంచన కాంచి దామ
కేయూర కంకణ మణి ద్యుతి దీపితస్య ।
ద్వారే నికుంజ నిలయస్య హరిం నిరీక్ష్య
వ్రీడావతీ మథ సఖీ మియ మిత్యువాచ ॥ 4 ॥
భావము:
శ్రీకృష్ణుడు రాధను అనేకవిధాలుగా అనునయించి, సంతోషపరచి ఒక పొదరింటిలో చేరి వేచి ఉండగా, రాధ కూడా తన దుఃఖాన్ని ఉపశమింపచేసుకొని సాయంకాలం చీకటిపడిన తర్వాత తగిన వస్త్రాలు, అలంకారాలు, ఆభరణాలను ధరించింది. ఆ సమయంలో చెలి కత్తె రాధతో ఇలా అంటోంది.
రాధా! నీ పాదాక్రాంతుడైన శ్రీకృష్ణుడు నీతో మధుర భాషణ చేయుటకు పొదరింటిలో వేచిఉన్నాడు. నీవు సంతోషంగా మణిమంజీర నాదాలతో నీ ప్రియుని చేరుకో. తరుణీజనులను సమ్మోహన పరచే ఆ మురళీధరుని మధుర స్వరాల్ని విను. తీగెలు, లతలు తమ చిగురుటాకుల చేతులతో ఆలస్యం లేకుండా నీవు కృష్ణుని చేరుకోమని ప్రేరేపిస్తున్నాయి. సిగ్గు వదిలివేసి, నీ సుందర ఆభరణాలు, గాజుల ధ్వనితో నీ రాకను నీ ప్రభువుకు తెలియజేయి. ఇంకా ఆలస్యం చేయక వేగంగా బయలుదేరు” అని చెలికత్తె చెబుతూ ఉంది.
తరువాత, రాధ సంకేత స్థానాన్ని చేరి, ఆ పొదరింటి వాకిట తన ముత్యాలహారంలోని మణులు, అందెలు, కంకణాలు, బంగారు హారాల యొక్క తళతళకాంతులు చీకటిని పోగొట్టి వెలుతురును కలిగించగా అక్కడ కృష్ణుని చూసి సిగ్గుపడుతున్న రాధను చూసి సఖి ఇలా అంటోంది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









