జయదేవ అష్టపది ప్రబంధః – 24 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
॥ ప్రబంధః – 24 ॥
(సుప్రీతపీతాంబర తాళశ్రేణీ)

రామక్రియా రాగ యతి తాళాభ్యాం గీయతే ।
కురు యదు నందన! చందన శిశిరతరేణ కరేణ పయోధరే ।
మృగమద పత్రకమత్ర మనో భవ మంగళ కలశ సహోదరే ॥
నిజగాద సా యదు నందనే క్రీడతి హృదయ నందనే ॥ (ధ్రువమ్) ॥
అళికుల గంజనమంజనకం రతి నాయక సాయక మోచనే ।
త్వదధర చుంబన లంబిత కజ్జల ఉజ్జ్వలయ ప్రియ లోచనే ॥
నయన కురంగ తరంగ వికాస నిరాస కరే శ్రుతి మండలే ।
మనసిజ పాశ విలాస ధరే శుభ వేశ నివేశయ కుండలే ॥
భ్రమర చయం రచయంతముపరి రుచిరం సుచిరం మమ సమ్ముఖే ।
జిత కమలే విమలే పరికర్మయ నర్మజనక మళకం ముఖే ॥
మృగమద రస వలితం లలితం కురు తిలకమళిక రజని కరే ।
విజిత కళంక కళం కమలానన విశ్రమిత శ్రమ శీకరే ॥
మమ రుచిరే చికురే కురు మానద మనసిజ ధ్వజ చామరే ।
రతి గలితే లలితే కుసుమాని శిఖండి శిఖండక డామరే ॥
సరస ఘనే జఘనే మమ శంబర దారణ వారణ కందరే ।
మణి రశనా వసనాభరణాని శుభాశయ వాసయ సుందరే ॥
శ్రీ జయదేవ వచసి రుచిరే సదయం హృదయం కురు మండనే ।
హరి చరణ స్మరణామృత నిర్మిత కలి కలుష జ్వర ఖండనే ॥
రచయ కుచయోః పత్రం చిత్రం కురుష్వ కపోలయోః
ఘటయ జఘనే కాంచీం ముగ్ధ స్రజా కబరీ భరం ।
కలయ వలయ శ్రేణీం పాణౌ పదే మణి నూపురౌ
ఇతి నిగదితః ప్రీతః పీతాంబరోఽపి తథాఽకరోత్ ॥ 9 ॥
యద్గాంధర్వ కలాసు కౌశలమనుధ్యానం చ యద్వైష్ణవం
యచ్ఛృంగార వివేక తత్త్వ రచనా కావ్యేషు లీలాయితం ।
తత్సర్వం జయదేవ పండిత కవేః కృష్ణైక తానాత్మనః
సానందాః పరిశోధయంతు సుధియః శ్రీ గీత గోవిందతః ॥ 10 ॥
శ్రీ భోజదేవ ప్రభవస్య రామాదేవీ సుత శ్రీ జయదేవకస్య ।
పరాశరాది ప్రియ వర్గ కంఠే శ్రీ గీతగోవింద కవిత్వమస్తు ॥ 11 ॥
సాధ్వీ! మాధ్వీక! చింతా న భవతి భవతః శర్కరే! కర్కశాఽసి
ద్రాక్షే! ద్రక్ష్యంతి కే త్వామమృత! మృతమసి క్షీర! నీరం రసస్తే ।
మాకంద! క్రంద కాంతాధర ధర! న తులాం గచ్ఛ యచ్ఛంతి భావం
యావచ్ఛృంగార సారం శుభమివ జయదేవస్య వైదగ్ధ్య వాచః ॥ 12 ॥
ఇత్థం కేళి తతిర్విహృత్య యమునా కూలే సమం రాధయా
తద్రోమావళి మౌక్తికావళి యుగే వేణీ భ్రమం బిభ్రతి ।
తత్రాహ్లాది కుచ ప్రయాగ ఫలయోర్లిప్సావతోర్హస్తయోః
వ్యాపారాః పురుషోత్తమస్య దదతు స్ఫీతాం ముదం సంపదమ్ ॥ 13 ॥
ఇతి శ్రీజయదేవకృతౌ గీతగోవిందే
సుప్రీతపీతాంబరో నామ ద్వాదశస్సర్గః॥
భావము:
ఇలా రతికేళికా విలాసాలననుభవించి అలసి ఉన్న గోవిందుడు, తన పట్ల కనబరచిన ప్రేమానురాగాలకు ఆశ్చర్యపడి రాధ ఇలా చెప్పింది.
“కృష్ణా! నీ ఎడబాటుతో నన్ను మన్మథుడు వేధించగా, నిన్నే నా మనసులో తలచి, నీ చెంతకు చేరి, రాసక్రీడలో అలసిపోయిన నా కళ్ళకు, చెదిరిపోయిన కాటుకరేఖలు సరిదిద్దు. నా చెవులకు తొలగిపోయిన కుండలాలు పెట్టు. నా చెక్కిళ్ళపై చిత్రలేఖనం చేయి. వికసించిన పద్మం వలె వున్న నా ముఖంపై తుమ్మెదలా వుండే భూషణాలను అలంకరించు. రతికేళిలో చెదిరిపోయిన తిలకాన్ని దిద్ది, ఈ చంద్ర బింబం వంటి ముఖసౌందర్యాన్ని అనుభవించు. విడిపోయిన నా కురులను ముడివేసి పుష్పాలతో అలంకరించు. చేతులకు గాజులు, కాళ్ళకు అందెలు అలంకరించు” అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు రాధను శోభాయమానంగా అలంకరించి ఆమె సౌందర్య కాంతులను ఆశగా చూసి ఆనందించాడు. ఈ విధంగా రాధాకృష్ణుల ప్రణయ క్రీడలు- యమునానది తీరాలలో నిండు చంద్రునితో పోటీ పడి ప్రకాశించాయి.
కావ్యంలో వచ్చే నాయికా, నాయకుల విరహాన్ని, ఉద్విగ్నమానసిక స్థితులను భక్తిలో, భక్తికై, భక్తితో తపిస్తున్న భక్తునికి అన్వయించి, అలానే నాయికా-నాయకుల సంతోష, సుఖాలను భగవంతుని అనుగ్రహానికి అన్వయించి చదివినపుడు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక కోణం ఆవిష్కారమౌతుంది.
ఈ విధంగా యమునానదీతీరంలో రాధాకృష్ణుల శృంగార కేళీ వినోదాలు గల ఈ కావ్యం చదివిన వారికి, విన్న వారికి సకల సౌభాగ్యాలు చేకూర్చుగాక!! సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
జయదేవుని అష్టపదులు
ప్రథమః సర్గః – సామోద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్
ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః
జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్
తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః
పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః
జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః
షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః
జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్

సప్తమః సర్గః – నాగర నారాయణః
జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః
అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః
జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ
నవమః సర్గః – ముగ్ధ ముకుందః
జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

దశమః సర్గః – చతుర చతుర్భుజః
జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః
ఏకాదశః సర్గః – సానంద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః
జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









