స్తోత్రాలకు తెలుగులో అర్థం » విష్ణు స్తోత్రాలు » కృష్ణ స్తోత్రాలు » జయదేవ అష్టపది ప్రబంధః – 19 | గీత గోవిందం తెలుగులో అర్థం
రాధాకృష్ణుల భక్తిశృంగార కావ్యం జయదేవుని అష్టపదులు తెలుగులో అర్థం చంద్రకాంతి నేపథ్యంలో శ్రీకృష్ణుడు రాధతో ఉన్న దివ్య చిత్రం.

జయదేవ అష్టపది ప్రబంధః – 19 | గీత గోవిందం తెలుగులో అర్థం

జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.

“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.

జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.

ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.

ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.

దశమః సర్గః – చతుర చతుర్భుజః

అత్రాంతరే మసృణ రోష వశాదసీమ
నిఃశ్వాస నిఃసహ ముఖీం సుముఖీముపేత్య ।
సవ్రీడమీక్షిత సఖీ వదనాం దినాంతే
సానంద గద్గద పదం హరిరిత్యువాచ ॥ 1॥

॥ ప్రబంధః – 19 ॥
(చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః)
(దేశవరాళి – మధ్యమాది) (ముఖారి – జంపె)

జయదేవ అష్టపది ప్రబంధః - 19 గీత గోవిందం తెలుగులో అర్థం.

దేశవరాళీ రాగాష్టతాళీ తాళాభ్యాం గీయతే ।
వదసి యది కించిదపి దంత రుచి కౌముదీ
హరతి దర తిమిరమతిఘోరం ।
స్ఫురదధర శీధవే తవ వదన చంద్రమా
రోచయతు లోచన చకోరమ్‌ ॥

ప్రియే! చారు శీలే! ప్రియే! చారు శీలే!
ముంచ మయి మానమనిదానం ।
సపది మదనానలో దహతి మమ మానసం
దేహి ముఖ కమల మధు పానమ్‌ ॥ (ధ్రువమ్‌) ॥

సత్యమేవాసి యది సుదతి! మయి కోపినీ
దేహి ఖర నఖర శర ఘాతం ।
ఘటయ భుజ బంధనం జనయ రద ఖండనం
యేన వా భవతి సుఖ జాతమ్‌ ॥

త్వమసి మమ భూషణం త్వమసి మమ జీవనం
త్వమసి మమ భవ జలధి రత్నం ।
భవతు భవతీహ మయి సతతమనురోధినీ
తత్ర మమ హృదయ మతియత్నమ్‌ ॥

నీల నళినాభమపి తన్వి! తవ లోచనం
ధారయతి కోక నద రూపం ।
కుసుమ శర బాణ భావేన యది రంజయసి
కృష్ణ మిదమేత దనురూపమ్‌ ॥

స్ఫురతు కుచ కుంభయోరుపరి మణి మంజరీ
రంజయతు తవ హృదయ దేశం ।
రసతు రశనాఽపి తవ ఘన జఘన మండలే
ఘోషయతు మన్మథ నిదేశమ్‌ ॥

స్థల కమల గంజనం మమ హృదయ రంజనం
జనిత రతి రంగ పరభాగం ।
భణ మసృణ వాణి! కరవాణి చరణ ద్వయం
సరస లసదలక్తక రాగమ్‌ ॥

స్మర గరళ ఖండనం మమ శిరసి మండనం
దేహి పద పల్లవముదారం ।
జ్వలతి మయి దారుణో మదన కదనానలో
హరతు తదుపాహిత వికారమ్‌ ॥

ఇతి చటుల చాటు పటు చారు ముర వైరిణో
రాధికామధి వచన జాతం ।
జయతి జయదేవ కవి భారతీ భూషితం
మానినీ జన జనిత శాతమ్‌ ॥

పరిహర కృతాతంకే! శంకాం త్వయా సతతం ఘన
స్తన జఘనయాఽఽక్రాంతే స్వాంతే పరానవకాశినీ ।
విశతి వితనోరన్యో ధన్యో న కోఽపి మమాంతరం
ప్రణయిని! పరీరంభారంభే విధేహి విధేయతామ్‌ ॥ 2 ॥

ముగ్ధే! విధేహి మయి నిర్దయ దంత దంశం
దోర్వల్లి బంధ నిబిడ స్తన పీడనాని ।
చండి! త్వమేవ ముదముద్వహ పంచ బాణ
చాండాల కాండ దళనా దసవః ప్రయాంతి ॥ 3॥

శశిముఖి! తవ భాతి భంగుర భ్రూః
యువ జన మోహ కరాళకాళసర్పీ ।
తదుదిత భయ భంజనాయ యూనాం
త్వదధర శీధు సుధైవ సిద్ధ మంత్రః ॥ 4 ॥

వ్యథయతి వృథా మౌనం తన్వి! ప్రపంచయ పంచమం
తరుణి! మధురాలాపైస్తాపం వినోదయ దృష్టిభిః ।
సుముఖి! విముఖీ భావం తావద్విముంచ న ముంచ మాం
స్వయమతిశయ స్నిగ్ధో ముగ్ధే! ప్రియోఽయ ముపస్థితః ॥ 5 ॥

బంధూక ద్యుతి బాంధవోఽయమధరః స్నిగ్ధో మధూక చ్ఛవిః
గండశ్చండి! చకాస్తి నీల నళిన శ్రీ మోచనం లోచనం ।
నాసాఽత్యేతి తిల ప్రసూన పదవీం కుందాభదంతి! ప్రియే!
ప్రాయ స్త్వన్ముఖ సేవయా విజయతే విశ్వం స పుష్పాయుధః ॥ 6 ॥

దృశౌ తవ మదాలసే వదనమిందు సందీపనం
గతిర్జన మనోరమా విధుత రంభ మూరుద్వయం ।
రతిస్తవ కలావతీ రుచిర చిత్రలేఖే భ్రువౌ
అహో! విబుధ యౌవతం వహసి తన్వి! పృథ్వీ గతా ॥ 7 ॥

స ప్రీతిం తనుతాం హరిః కువలయాపీడేన సార్ధం రణే
రాధా పీన పయోధర స్మరణ కృత్కుంభేన సంభేదవాన్‌ ।
యత్ర స్విద్యతి మీలతి క్షణమపి క్షిప్రం తదాలోకన
వ్యామోహేన జితం జితం జితమభూత్కంసస్య కోలాహలః ॥ 8 ॥  

ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే
చతురచతుర్భుజో నామ దశమస్సర్గః॥

భావము:

సాయంకాల సమయంలో చెలికత్తె చెప్పిన సాంత్వన వాక్యాల వలన కొంత కోపాన్ని తగ్గించుకొని మన్మథ బాణాల వలన దుఃఖిస్తున్న రాధ వద్దకు శ్రీకృష్ణుడు వచ్చి, ఆనందంతో తడబడుతూ ఇలా చెప్తున్నాడు.
“రాధా! నాపై నీకు కోపం వద్దు. మదనాగ్నిలో దహించుకుపోతున్న నన్ను నీ ముఖ పద్మంలోని అమృతంతో సాంత్వన కలిగించు. నీకు ఇంకా కోపం వుంటే, నీ మృదువైన చూపులతో నన్ను బందీ చేయి, నీకు తోచిన రీతిలో, నీ ఇష్ట ప్రకారం నన్ను శిక్షించు. నీ మృదువైన బాహువులతో నన్ను బంధించు.  రాధా! నీవే నా జీవనం. నీవే నా శృంగార భావజలధిలోని రత్నానివి. నన్ను అనుగ్రహించి, నాపై నీ దయ, ప్రేమ చూపించు.  
తామరల కన్నా ఎక్కువ సౌందర్యంతో ఉన్న నీ అందమైన పాదాలకు ఎరుపురంగు అలముతాను. నీ పాదాలను నా తలపై ఉంచుము. మన్మథుని వలన కలిగే వికార చేష్టలన్నీ నీ పాదస్పర్శతో తొలగిపోతాయి. రాధా! నేను పరకాంతతో కూడియున్నానని సందేహిస్తున్నావు కాబోలు. నన్ను అనుమానించవద్దు. అపురూప సౌందర్య రాశివి అయిన నీవు తప్పితే వేరెవరికీ నా హృదయంలో స్థానం లేదు. మన్మథుడు మాత్రమే నా హృదయంలో ప్రవేశించగలడు. నీ మౌనం నన్ను పీడిస్తోంది. కోకిల లాగా పంచమస్వరంలో మధురంగా పలుకరించు. నీ చల్లని చూపులతో నా తాపం తొలగించు. నీవు నన్ను కోపంతో విడిచి వేయకు. ఎంతో ప్రేమతో నీ దగ్గరకు చేరాను. నన్ను మోసం చేయకు. ముఖం తిప్పుకొని వెళ్లకు. ఈ కృష్ణుడు నీపై అత్యంత ప్రేమతో ఇక్కడికి వచ్చినప్పటికీ స్వీకరించకుండా ఉన్నావెందుకు? నీ వదనం చంద్రబింబంలా ప్రకాశవంతంగా వుంది. ఏమి ఈ చిత్రం! నీవు భూమిపై ఉండే అందగత్తెవైనా స్వర్గలోకంలోని అందగత్తెల లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. అందంలో వారితో పోటీ పడుతున్నావు. నీవు ఈ భువిపై అవతరించిన దేవాంగనవు. దయచేసి నన్ను నీ సేవకునిగా స్వీకరించు.  

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

జయదేవుని అష్టపదులు

ప్రథమః సర్గః – సామోద దామోదరః

జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్‌
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్‌
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్‌
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్‌

ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః

జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్‌

తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః

జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్‌

జయదేవ అష్టపది ప్రబంధః - 1 గీత గోవిందం తెలుగులో, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య లీలలు.

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః

జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః

పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః

జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః

షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః

జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్‌

జయదేవ అష్టపది ప్రబంధః - 10 గీత గోవిందం తెలుగులో అర్థం.

సప్తమః సర్గః – నాగర నారాయణః

జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః

అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః

జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ

నవమః సర్గః – ముగ్ధ ముకుందః

జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

జయదేవ అష్టపది ప్రబంధః - 12 గీత గోవిందం తెలుగులో అర్థం, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య ప్రేమ లీలలు.

దశమః సర్గః – చతుర చతుర్భుజః

జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః

ఏకాదశః సర్గః – సానంద దామోదరః

జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

జయదేవ అష్టపది ప్రబంధః - 22 గీత గోవిందం తెలుగులో అర్థం, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య ప్రేమ లీలలు.

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః

జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top