స్తోత్రాలకు తెలుగులో అర్థం » విష్ణు స్తోత్రాలు » కృష్ణ స్తోత్రాలు » జయదేవ అష్టపది ప్రబంధః – 11 | గీత గోవిందం తెలుగులో అర్థం
శ్రీ గీత గోవిందం సరళమైన తెలుగులో అర్థం రాధాకృష్ణుల అందమైన దివ్య చిత్రం.

జయదేవ అష్టపది ప్రబంధః – 11 | గీత గోవిందం తెలుగులో అర్థం

జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.

“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.

జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.

ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.

ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.

॥ ప్రబంధః – 11 ॥
(సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః)
(ఘూర్జరీ – ఏక) (పాడి – )

జయదేవ అష్టపది ప్రబంధః - 11 గీత గోవిందం తెలుగులో అర్థం, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య ప్రేమ లీలలు.

ఘూర్జరీ రాగేణ ఏకతాళేన గీయతే ।
రతి సుఖ సారే గతమభిసారే మదన మనోహర వేశం ।
న కురు నితంబిని! గమన విళంబన మనుసర తం హృదయేశమ్‌ ॥

ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలీ ।
గోపీ పీనపయోధర మర్దన చంచల కరయుగశాలీ॥ (ధ్రువమ్‌) ॥

నామ సమేతం కృత సంకేతం వాదయతే మృదు వేణుం ।
బహు మనుతే నను తే తనుసంగత పవన చలితమపి రేణుమ్‌ ॥

పతతి పతత్రే విచలతి పత్రే శంకిత భవదుపయానం ।
రచయతి శయనం సచకితనయనం పశ్యతి తవ పంథానమ్‌ ॥

ముఖరమధీరం త్యజ మంజీరం రిపుమివ కేళిషు లోలం ।
చల సఖి! కుంజం సతిమిరపుంజం శీలయ నీల నిచోళమ్‌ ॥

ఉరసి మురారేరుపహిత హారే ఘన ఇవ తరళ బలాకే ।
తటిదివ పీతే! రతి విపరీతే రాజసి సుకృత విపాకే ॥

విగళిత వసనం పరిహృత రశనం ఘటయ జఘనమపిధానం ।
కిసలయ శయనే పంకజ నయనే! నిధిమివ హర్ష నిధానమ్‌ ॥

హరిరభిమానీ రజనిరిదానీమియమపి యాతి విరామం ।
కురు మమ వచనం సత్వర రచనం పూరయ మధు రిపు కామమ్‌ ॥

శ్రీ జయదేవే కృత హరి సేవే భణతి పరమ రమణీయం ।
ప్రముదిత హృదయం హరిమతిసదయం నమత సుకృత కమనీయం ॥

వికిరతి ముహుః శ్వాసానాశాః పురో ముహురీక్షతే
ప్రవిశతి ముహుః కుంజం గుంజన్ముహుర్బహు తామ్యతి ।
రచయతి ముహుః శయ్యాం పర్యాకులం ముహురీక్షతే
మదన కదన క్లాంతః కాంతే! ప్రియస్తవ వర్తతే ॥ 3॥

త్వద్వామ్యేన సమం సమగ్రమధునా తిగ్మాంశు రస్తంగతో
గోవిందస్య మనోరథేన చ సమం ప్రాప్తం తమః సాంద్రతాం ।
కోకానాం కరుణ స్వనేన సదృశీ దీర్ఘా మదభ్యర్థనా
తన్ముగ్ధే! విఫలం విలంబనమసౌ రమ్యోఽభిసార క్షణః ॥ 4॥

సా మాం ద్రక్ష్యతి వక్ష్యతి స్మర కథాం ప్రత్యంగమాలింగనైః
ప్రీతిం యాస్యతి రంస్యతే సఖి! సమాగత్యేతి చింతాకులః ।
స త్వాం పశ్యతి వేపతే పులకయత్యానందతి స్వేదతి
ప్రత్యుద్గచ్ఛతి మూర్ఛతి స్థిర తమః పుంజే నికుంజే స్థితః ॥ 5 ॥

ఆశ్లేషాదను చుంబనాదను నఖోల్లేఖాదను స్వాంతజ
ప్రోద్బోధాదను సంభ్రమాదను రతారంభాదను ప్రీతయోః ।
అన్యార్థం గతయోర్భ్రమాన్మిళితయోః సంభాషణైర్జానతోః
దంపత్యోరిహ కో న కో న తమసి వ్రీడా విమిశ్రో రసః ॥ 6 ॥
స భయ చకితం విన్యస్యంతీం దృశౌ తిమిరే పథి
ప్రతితరు ముహుః స్థిత్వా మందం పదాని వితన్వతీం ।
కథమపి రహః ప్రాప్తామంగైరనంగ తరంగిభిః
సుముఖి! సుభగః పశ్యన్‌ సత్వాముపైతు కృతార్థతామ్‌ ॥7॥

రాధా ముగ్ధ ముఖారవింద మధుప స్త్రైలోక్యమౌళిస్థలీ
నేపథ్యోచిత నీల రత్నమవనీ భారావతారాంతకః ।
స్వచ్ఛందం వ్రజ సుందరీ జన మనస్తోష ప్రదోషోదయః
కంస ధ్వంసన ధూమ కేతురవతు త్వాం దేవకీ నందనః ॥ 8 ॥

ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందేఽభిసారికావర్ణనే
సాకాంక్షపుండరీకాక్షో నామ పంచమస్సర్గః॥

భావము:

రాధా! నీ స్వామి వేడి నిట్టూర్పులు విడుస్తున్నాడు. పి‌ల్లగాలులు వీచే యమునా నదీ తీరాన నీ రాకకై నిరీక్షిస్తున్నాడు. నీ కోసమై అన్వేషిస్తున్నాడు. నీ కొరకు పరితపించిపోతున్నాడు. సూర్యుడు ఇప్పుడే అస్తమించాడు. గోవిందుని విచారగ్రస్తమైన హృదయం లాగా చీకటి చిక్కపడింది.  నా మాటను విను. ఆలస్యం మంచిది కాదు. శ్రీహరి పొందుకు ఇదే సరియైన సమయం.  రాధా! నీవు కృష్ణుని కలుసుకోగానే రసరమ్య కథలు వినిపిస్తావని, ఆసాంతం గాఢ ఆలింగనాలతో ముంచివేసి తనతో ఆనందిస్తావని ఆశతో, అనేక మధుర భావాలతో కృష్ణుడు నీకై ఎదురు చూస్తున్నాడు. హరి, చీకటి నిండిన ఆ పొదరింట్లో ఉన్నాడు. విరహ వేదనతో పరితపిస్తున్నాడు. స్వేదంతో తడిసిపోయాడు. ఆలోచనలతో మూర్ఛపోయాడు.
ఓ సుముఖీ! చీకటిలో ఏమీ కనపడక, బిత్తర చూపులతో, భయంతో, మాటిమాటికీ ఆగుతూ మెల్లమెల్లగా నడుస్తున్న మదన తరంగాల వంటి అవయవ సోయగాలతో ఉన్న నిన్ను గమనించి, ఆ సుందరుడైన ప్రభువు నిన్ను చేరి ఆనందించు గాక! శ్రీ కృష్ణుడుండే సంకేత స్థానానికి పోవడానికి ఇదే మంచి సమయం” అని రాధయే శ్రీ కృష్ణుని సర్వస్వం అని కృష్ణుని ఉత్కంఠను వర్ణిస్తూ రాధను తొందరపెడుతోంది సఖి.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

జయదేవుని అష్టపదులు

ప్రథమః సర్గః – సామోద దామోదరః

జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్‌
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్‌
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్‌
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్‌

ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః

జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్‌

తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః

జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్‌

జయదేవ అష్టపది ప్రబంధః - 1 గీత గోవిందం తెలుగులో, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య లీలలు.

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః

జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః

పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః

జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః

షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః

జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్‌

జయదేవ అష్టపది ప్రబంధః - 10 గీత గోవిందం తెలుగులో అర్థం.

సప్తమః సర్గః – నాగర నారాయణః

జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః

అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః

జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ

నవమః సర్గః – ముగ్ధ ముకుందః

జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

జయదేవ అష్టపది ప్రబంధః - 12 గీత గోవిందం తెలుగులో అర్థం, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య ప్రేమ లీలలు.

దశమః సర్గః – చతుర చతుర్భుజః

జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః

ఏకాదశః సర్గః – సానంద దామోదరః

జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

జయదేవ అష్టపది ప్రబంధః - 22 గీత గోవిందం తెలుగులో అర్థం, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య ప్రేమ లీలలు.

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః

జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top