స్తోత్రాలకు తెలుగులో అర్థం » విష్ణు స్తోత్రాలు » కృష్ణ స్తోత్రాలు » జయదేవ అష్టపది ప్రబంధః – 8 | గీత గోవిందం తెలుగులో అర్థం
శ్రీ గీత గోవిందం సరళమైన తెలుగులో అర్థం రాధాకృష్ణుల అందమైన దివ్య చిత్రం.

జయదేవ అష్టపది ప్రబంధః – 8 | గీత గోవిందం తెలుగులో అర్థం

జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.

“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.

జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.

ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.

ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః

యమునా తీర వానీర నికుంజే మంద మాస్థితం ।
ప్రాహ ప్రేమ భరోద్భ్రాంతం మాధవం రాధికా సఖీ ॥ 2 ॥

॥ ప్రబంధః – 8 ॥
(హరివల్లభాశోక పల్లవః)
(కర్ణాట – ఏక) (సౌరాష్ట్ర/కానడ -)

జయదేవ అష్టపది ప్రబంధః - 8 గీత గోవిందం తెలుగులో అర్థం.

కర్ణాట రాగైక తాళీ తాళాభ్యాం గీయతే ।
నిందతి చందనమిందుకిరణమను విందతి ఖేదమధీరం ।
వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరమ్‌ ॥

మాధవ మనసిజ విశిఖ భయాదివ భవదవనయా త్వయి లీనా ।
సా విరహే తవ దీనా ॥ (ధ్రువమ్‌) ॥

అవిరళ నిపతిత మదన శరాదివ భవదవనాయ విశాలం ।
స్వహృదయ మర్మణి వర్మ కరోతి సజల నళినీదళజాలమ్‌ ॥

కుసుమ విశిఖ శర తల్పమనల్ప విలాస కలా కమణీయం ।
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయమ్‌ ॥

వహతి చ వలిత విలోచన జల ధరమానన కమలముదారం ।
విధుమివ వికట విధుంతుద దంత దళన గలితామృత ధారమ్‌ ॥

విలిఖతి రహసి కురంగ మదేన భవంతమసమ శర భూతం ।
ప్రణమతి మకరమధో వినిధాయ కరే చ శరం నవ చూతమ్‌ ॥

ధ్యాన లయేన పురః పరికల్ప్య భవంతమతీవ దురాపం ।
విలపతి హసతి విషీదతి రోదితి చంచతి ముంచతి తాపమ్‌ ॥

ప్రతిపదమిదమపి నిగదతి మాధవ! తవ చరణే పతితాఽహం ।
త్వయి విముఖే మయి సపది సుధానిధిరపి తనుతే తను దాహమ్‌ ॥

శ్రీ జయదేవ భణిత మిదమధికం యది మనసా నటనీయం ।
హరి విరహాకుల వల్లవ యువతి సఖీ వచనం పఠనీయమ్‌ ॥

ఆవాసో విపినాయతే ప్రియ సఖీ మాలాఽపి జాలాయతే
తాపోఽపి శ్వసితేన దావదహన జ్వాల కలాపాయతే ।
సాఽపి త్వద్విరహేణ హంత! హరిణీ రూపాయతే హా! కథం
కందర్పోఽపి యమాయతే విరచయన్‌ శార్దూలవిక్రీడితమ్‌ ॥ 2 ॥


ఇలా యమునా నదీతీరంలోని పొదరింటిలో నిశ్శబ్దంగా, నిరాశతో ఒంటరిగా కూర్చొని ఉన్న శ్రీకృష్ణుని- రాధ చెలికత్తె కలుసుకొని ఇలా అంటోంది. “కృష్ణా! నీ విరహంతో దీనురాలైన రాధ చందన గంధ సువాసనల్ని, చంద్రుని చల్లని కిరణాల్ని దూషిస్తున్నది.  మలయ పర్వతం పైనుండి వచ్చే ఆహ్లాదకరమైన మలయ మారుతాన్ని కూడా విషంగా భావించి విరహ వేదనతో బాధపడుతున్నది.

భావము:

అంతం లేకుండా తనపై వచ్చి పడుతున్న మన్మథ బాణాలు తన హృదయంలో వున్న నీకు తాకి బాధిస్తాయేమోనని భయంతో, తన హృదయాన్ని తామరాకులతో దట్టంగా కవచంలా కప్పుకొని విరహ వేదనతో ఉంది.  నీ విరహవేదనతో మేఘాలవలె కన్నీళ్ళు నిండిన కన్నులతో, ముఖ సౌందర్యాన్ని కోల్పోయింది. నీవు తన ముందే ఉన్నావనే భావనతో, వేదనతో రోదిస్తోంది. వెర్రిగా నవ్వుతోంది. విరహవేదనతో ఆమె శరీరం, మనస్సు నిర్ణయగా కృశించి పోతున్నాయి. నీ ఆలింగన సౌఖ్యాన్ని కోరుకున్న రాధ, సకల కలలతో నిండిన కుసుమ శయ్యపై శయనించింది.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

జయదేవుని అష్టపదులు

ప్రథమః సర్గః – సామోద దామోదరః

జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్‌
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్‌
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్‌
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్‌

ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః

జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్‌

తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః

జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్‌

జయదేవ అష్టపది ప్రబంధః - 1 గీత గోవిందం తెలుగులో, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య లీలలు.

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః

జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః

పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః

జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః

షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః

జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్‌

జయదేవ అష్టపది ప్రబంధః - 10 గీత గోవిందం తెలుగులో అర్థం.

సప్తమః సర్గః – నాగర నారాయణః

జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః

అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః

జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ

నవమః సర్గః – ముగ్ధ ముకుందః

జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

జయదేవ అష్టపది ప్రబంధః - 12 గీత గోవిందం తెలుగులో అర్థం, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య ప్రేమ లీలలు.

దశమః సర్గః – చతుర చతుర్భుజః

జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః

ఏకాదశః సర్గః – సానంద దామోదరః

జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

జయదేవ అష్టపది ప్రబంధః - 22 గీత గోవిందం తెలుగులో అర్థం, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య ప్రేమ లీలలు.

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః

జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top