నారాయణీయం – తెలుగులో అర్థం
నారాయణీయం గ్రంథాన్ని 16వ శతాబ్దంలో కేరళకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు, కవి అయిన మేల్పత్తూరు నారాయణ భట్టతిరి (Melpathur Narayana Bhattathiri) రచించారు. ఇది వేదవ్యాసుడు రచించిన మహాభాగవత పురాణంలోని 18,000 శ్లోకాల సారాంశాన్ని, కేవలం 1036 శ్లోకాలతో 100 దశకాలుగా (ప్రతి దశకంలో దాదాపు 10 శ్లోకాలు ఉండేలా) సంక్షిప్తీకరించిన అద్భుతమైన భక్తి కావ్యము.
నారాయణీయం పుట్టుకకు దారితీసిన పూర్వ కథ:
నారాయణ భట్టతిరి తన గురువైన అచ్యుత పిషారడి వద్ద సకల శాస్త్రాలను అభ్యసించారు. కొంతకాలానికి ఆ గురువుగారు వాతరోగం (కీళ్లనొప్పులు/పక్షవాతం వంటి దీర్ఘకాలిక వ్యాధి) బారిన పడ్డారు. గురువుగారి యాతనను చూడలేక భట్టతిరి తన భక్తి, యోగబలంతో గురు దక్షిణగా ఆ వ్యాధిని తనపైకి మార్చుకున్నారు. దాంతో గురువుగారు సంపూర్ణ ఆరోగ్యవంతులు కాగా, భట్టతిరి స్వయంగా ఆ తీవ్రమైన వాతరోగంతో బాధపడాల్సి వచ్చింది.
భట్టతిరి అనుభవిస్తున్న దుర్భరమైన రోగబాధను చూసి చలించిపోయిన మలయాళ కవి ఎచ్చాచాన్ అనే పండితుడు, “మీన్ తొటూ కూట్టుక” (చేపలతో ప్రారంభించండి) అని సలహా ఇస్తారు. పైకి ఇది శాకాహార బ్రాహ్మణులకు విచిత్రంగా అనిపించినా, దాని అంతరార్థం మహాభాగవతంలోని ప్రథమ ఘట్టాలైన విష్ణుమూర్తి మత్స్యావతారం (చేప) మొదలుకొని దశావతారాల క్రమంలో భగవత్లీలలను వర్ణిస్తూ భాగవతాన్ని ప్రారంభించమని అర్థం.
ఆ సలహాను స్వీకరించిన భట్టతిరి కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గురువాయూరు చేరుకున్నారు. అక్కడ గురువాయూరప్ప (శ్రీకృష్ణుడు) సన్నిధిలో రోజూ ఒక దశకం (సుమారు 10 శ్లోకాలు) చొప్పున శ్రీకృష్ణుడి లీలలను కీర్తిస్తూ స్తుతించడం ప్రారంభించారు. ప్రతి దశకం చివరి శ్లోకంలో తన రోగ రుగ్మతలను తొలగించి ఆయురారోగ్యాలు ప్రసాదించమని స్వామిని వేడుకునేవారు.
సాక్షాత్కారం మరియు సంపూర్ణ ఆరోగ్యం:
అలా సరిగ్గా 100 రోజులు పాటు రోజుకొక దశకం చొప్పున 100 దశకాలను (1036 శ్లోకాలను) పూర్తి చేశారు. ఈ కావ్య రచన సాగుతున్నంత కాలం శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయనకు అగోచరంగా లేదా ప్రత్యక్షంగా మార్గదర్శనం చేశాడని ప్రతీతి. నూటవ రోజున చివరి దశకం (“ఆయురారోగ్య సౌఖ్యమ్”) పూర్తి చేసేసరికి భట్టతిరి వ్యాధి పూర్తిగా నయమై, సంపూర్ణ దివ్య ఆరోగ్యాన్ని పొందారు. ఆ రోజు ఆయన ఎదురుగా సాక్షాత్కరించిన వేణుగోపాల స్వామి రూపాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణించారు.
మహావిష్ణువును కీర్తిస్తూ రచించడం వల్ల మరియు రచయిత పేరు నారాయణ భట్టతిరి కావడం వల్ల ఈ అద్భుత కావ్యానికి ‘నారాయణీయం‘ అనే పేరు సార్థకమైంది. నాటి నుండి భౌతిక, మానసిక వ్యాధులు నివారణ కావడానికి మరియు భక్తి జ్ఞానాలు సిద్ధింపజేసుకోవడానికి భక్తులు ఈ నారాయణీయ పారాయణ చేయడం ఆచారంగా వస్తోంది.
నారాయణీయం 1 వ దశకమ్ – పరబ్రహ్మ స్వరూపం
నారాయణీయం 2 వ దశకమ్ – దివ్యమంగళ రూపమాధుర్యం
నారాయణీయం 3 వ దశకమ్ – ఉత్తమ భక్తుని లక్షణాలు
నారాయణీయం 4 వ దశకమ్ – అష్టాంగ యోగసాధన
నారాయణీయం 5 వ దశకమ్ – విరాట్ పురుషుని ఆవిర్భావం
నారాయణీయం 6 వ దశకమ్ – విరాట్ స్వరూప వర్ణన
నారాయణీయం 7 వ దశకమ్ – బ్రహ్మదేవుని జననం, తపస్సు మరియు వైకుంఠ దర్శనం
నారాయణీయం 8 వ దశకమ్ – ప్రళయ వర్ణన
నారాయణీయం 9 వ దశకమ్ – బ్రహ్మదేవుని తపస్సు మరియు లోకసృష్టి
నారాయణీయం 10 వ దశకమ్ – సృష్టిలోని వైవిధ్యం
నారాయణీయం 11 వ దశకమ్ – హిరణ్యాక్షస్య తథా హిరణ్యకశిపోః జననమ్ |
నారాయణీయం 12 వ దశకమ్ – వరాహావతారమ్
నారాయణీయం 13 వ దశకమ్ – హిరణ్యాక్షవధ
నారాయణీయం 14 వ దశకమ్ – కపిలావతారమ్
నారాయణీయం 15 వ దశకమ్ – కపిలోపదేశమ్
నారాయణీయం 16 వ దశకమ్ – నరనారాయణావతారం తథా దక్షయాగః
నారాయణీయం 17 వ దశకమ్ – ధ్రువచరితమ్
నారాయణీయం 18 వ దశకమ్ – పృథుచరితమ్
నారాయణీయం 19 వ దశకమ్ – ప్రచేతృణాం చరితమ్
నారాయణీయం 20 వ దశకమ్ – ఋషభయోగీశ్వరచరితమ్
నారాయణీయం 21 వ దశకమ్ – జంబూద్వీపాదిషు ఉపాసనాపద్ధతిః |
నారాయణీయం 22 వ దశకమ్ – అజామిలోపాఖ్యానమ్
నారాయణీయం 23 వ దశకమ్ – దక్షచరితం తథా చిత్రకేతూపాఖ్యానమ్
నారాయణీయం 24 వ దశకమ్ – ప్రహ్లాదచరితమ్
నారాయణీయం 25 వ దశకమ్ – నరసింహావతారమ్
నారాయణీయం 26 వ దశకమ్ – గజేంద్రమోక్షమ్
నారాయణీయం 27 వ దశకమ్ – క్షీరాబ్ధిమథనం తథా కూర్మావతారమ్
నారాయణీయం 28 వ దశకమ్ – లక్ష్మీస్వయంవరం తథా అమృతోత్పత్తిః
నారాయణీయం 29 వ దశకమ్ – మోహిన్యవతారం ఆది
నారాయణీయం 30 వ దశకమ్ – వామనావతారమ్
నారాయణీయం 31 వ దశకమ్ – బలిదర్పహరణమ్
నారాయణీయం 32 వ దశకమ్ – మత్స్యావతారమ్
నారాయణీయం 33 వ దశకమ్ – అంబరీషచరితమ్
నారాయణీయం ౩4వ దశకమ్ – శ్రీరామావతారమ్
నారాయణీయం 35 వ దశకమ్ – శ్రీరామావతారమ్
నారాయణీయం 36 వ దశకమ్ – పరశురామావతారమ్
నారాయణీయం 37 వ దశకమ్ – శ్రీకృష్ణావతారోపక్రమమ్
నారాయణీయం 38 వ దశకం – శ్రీకృష్ణావతారమ్
నారాయణీయం 39 వ దశకమ్ – యోగమాయా ప్రాదుర్భావం తథా గోకులే కృష్ణజన్మోత్సవమ్
నారాయణీయం 40 వ దశకమ్ – పూతనామోక్షమ్
నారాయణీయం 41 వ దశకమ్ – పూతనాదహనం తథా కృష్ణలాలనాహ్లాదమ్
నారాయణీయం 42 వ దశకమ్ – శకటాసురవధ









Please post narayaneeyam rest of the dasakams. (11-100)Thank you 🙏
తప్పకుండా. బృందా గారు . త్వరలోనే నారాయనీయం మిగిలిన దశకాలు కూడా post చేస్తాను. ధన్యవాదములు. 🙏🙏🙏🙏
Dhanyavadalu aparna garu🙏