జయదేవ అష్టపది ప్రబంధః – 8 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః
యమునా తీర వానీర నికుంజే మంద మాస్థితం ।
ప్రాహ ప్రేమ భరోద్భ్రాంతం మాధవం రాధికా సఖీ ॥ 2 ॥
॥ ప్రబంధః – 8 ॥
(హరివల్లభాశోక పల్లవః)
(కర్ణాట – ఏక) (సౌరాష్ట్ర/కానడ -)

కర్ణాట రాగైక తాళీ తాళాభ్యాం గీయతే ।
నిందతి చందనమిందుకిరణమను విందతి ఖేదమధీరం ।
వ్యాళనిలయ మిళనేన గరళమివ కలయతి మలయ సమీరమ్ ॥
మాధవ మనసిజ విశిఖ భయాదివ భవదవనయా త్వయి లీనా ।
సా విరహే తవ దీనా ॥ (ధ్రువమ్) ॥
అవిరళ నిపతిత మదన శరాదివ భవదవనాయ విశాలం ।
స్వహృదయ మర్మణి వర్మ కరోతి సజల నళినీదళజాలమ్ ॥
కుసుమ విశిఖ శర తల్పమనల్ప విలాస కలా కమణీయం ।
వ్రతమివ తవ పరిరంభ సుఖాయ కరోతి కుసుమ శయనీయమ్ ॥
వహతి చ వలిత విలోచన జల ధరమానన కమలముదారం ।
విధుమివ వికట విధుంతుద దంత దళన గలితామృత ధారమ్ ॥
విలిఖతి రహసి కురంగ మదేన భవంతమసమ శర భూతం ।
ప్రణమతి మకరమధో వినిధాయ కరే చ శరం నవ చూతమ్ ॥
ధ్యాన లయేన పురః పరికల్ప్య భవంతమతీవ దురాపం ।
విలపతి హసతి విషీదతి రోదితి చంచతి ముంచతి తాపమ్ ॥
ప్రతిపదమిదమపి నిగదతి మాధవ! తవ చరణే పతితాఽహం ।
త్వయి విముఖే మయి సపది సుధానిధిరపి తనుతే తను దాహమ్ ॥
శ్రీ జయదేవ భణిత మిదమధికం యది మనసా నటనీయం ।
హరి విరహాకుల వల్లవ యువతి సఖీ వచనం పఠనీయమ్ ॥
ఆవాసో విపినాయతే ప్రియ సఖీ మాలాఽపి జాలాయతే
తాపోఽపి శ్వసితేన దావదహన జ్వాల కలాపాయతే ।
సాఽపి త్వద్విరహేణ హంత! హరిణీ రూపాయతే హా! కథం
కందర్పోఽపి యమాయతే విరచయన్ శార్దూలవిక్రీడితమ్ ॥ 2 ॥
ఇలా యమునా నదీతీరంలోని పొదరింటిలో నిశ్శబ్దంగా, నిరాశతో ఒంటరిగా కూర్చొని ఉన్న శ్రీకృష్ణుని- రాధ చెలికత్తె కలుసుకొని ఇలా అంటోంది.
“కృష్ణా! నీ విరహంతో దీనురాలైన రాధ చందన గంధ సువాసనల్ని, చంద్రుని చల్లని కిరణాల్ని దూషిస్తున్నది. మలయ పర్వతం పైనుండి వచ్చే ఆహ్లాదకరమైన మలయ మారుతాన్ని కూడా విషంగా భావించి విరహ వేదనతో బాధపడుతున్నది.
భావము:
అంతం లేకుండా తనపై వచ్చి పడుతున్న మన్మథ బాణాలు తన హృదయంలో వున్న నీకు తాకి బాధిస్తాయేమోనని భయంతో, తన హృదయాన్ని తామరాకులతో దట్టంగా కవచంలా కప్పుకొని విరహ వేదనతో ఉంది. నీ విరహవేదనతో మేఘాలవలె కన్నీళ్ళు నిండిన కన్నులతో, ముఖ సౌందర్యాన్ని కోల్పోయింది. నీవు తన ముందే ఉన్నావనే భావనతో, వేదనతో రోదిస్తోంది. వెర్రిగా నవ్వుతోంది. విరహవేదనతో ఆమె శరీరం, మనస్సు నిర్ణయగా కృశించి పోతున్నాయి. నీ ఆలింగన సౌఖ్యాన్ని కోరుకున్న రాధ, సకల కలలతో నిండిన కుసుమ శయ్యపై శయనించింది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









