స్తోత్రాలకు తెలుగులో అర్థం » విష్ణు స్తోత్రాలు » కృష్ణ స్తోత్రాలు » జయదేవ అష్టపది ప్రబంధః – 12 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది ప్రబంధః - 12 గీత గోవిందం తెలుగులో అర్థం, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య ప్రేమ లీలలు.

జయదేవ అష్టపది ప్రబంధః – 12 | గీత గోవిందం తెలుగులో అర్థం

జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.

“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.

జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.

ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.

ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.

షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః

అథ తాం గంతుమశక్తాం చిరమనురక్తాం లతా గృహే దృష్ట్వా ।
తచ్చరితం గోవిందే మనసిజ మందే సఖీ ప్రాహ ॥ 1 ॥ 

॥ ప్రబంధః – 12 ॥
(ధన్య వైకుంఠ కుంకుమమ్‌)
(గుండక్రియా – రూపక) (శంకరాభరణ – )

జయదేవ అష్టపది ప్రబంధః - 12 గీత గోవిందం తెలుగులో అర్థం, శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి దివ్య ప్రేమ లీలలు.

గుణకరీ రాగేన రూపక తాళేన గీయతే ।
పశ్యతి దిశి దిశి రహసి భవంతం ।
తదధర మధుర మధూని పిబంతమ్‌ ॥

నాథ! హరే! జగన్నాథ! హరే!
సీదతి రాధా వాస గృహే ॥ (ధ్రువమ్‌) ॥

త్వదభిసరణ రభసేన వలంతీ ।
పతతి పదాని కియంతీ చలంతీ ॥

విహిత విశద బిస కిసలయ వలయా ।
జీవతి పరమిహ తవ రతి కలయా ॥

ముహురవలోకిత మండన లీలా ।
మధురిపు రహమితి భావన శీలా ॥

త్వరితముపైతి న కథమభిసారం ।
హరిరితి వదతి సఖీమనువారమ్‌ ॥

శ్లిష్యతి చుంబతి జల ధర కల్పం ।
హరిరుపగత ఇతి తిమిరమనల్పమ్‌ ॥

భవతి విలంబిని విగళిత లజ్జా ।
విలపతి రోదితి వాసక సజ్జా ॥

శ్రీ జయదేవ కవే రిదముదితం ।
రసిక జనం తనుతా మతిముదితమ్‌ ॥

విపుల పులక పాళిః స్ఫీత సీత్కారమంత
ర్జనిత జడిమ కాకు వ్యాకులం వ్యాహరంతీ ।
తవ కితవ విధత్తేఽమంద కందర్ప చింతాం
రస జల నిధి మగ్నా ధ్యాన లగ్నా మృగాక్షీ ॥ 2 ॥

అంగేష్వాభరణం కరోతి బహుశః పత్రేఽపి సంచారిణీ
ప్రాప్తం త్వాం పరిశంకతే వితనుతే శయ్యాం చిరం ధ్యాయతి ।
ఇత్యాకల్ప వికల్ప తల్పరచనాసంకల్ప లీలా శత
వ్యాసక్తాఽపి వినా త్వయా వర తనుర్నైషా నిశాం నేష్యతి ॥ 3 ॥

కిం విశ్రామ్యసి కృష్ణభోగిభవనే భాండీరభూమీరుహిః
భ్రాతః! యాహి న దృష్టి గోచరమితః సానంద నందాస్పదం ।
రాధాయా వచనం తదధ్వగ ముఖాన్నందాంతికే గోపతో
గోవిందస్య జయంతి సాయమతిథి ప్రాశస్త్య గర్భా గిరః ॥ 4 ॥

ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే
సోత్కంఠ వైకుంఠః నామో షష్ఠస్సర్గః ॥

భావము:

శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్లడానికి కూడా కదిలే శక్తి లేని రాధ తానున్న పొదరింటిలోనే కృష్ణుని కలవాలనుకుంటోంది. ఈ విషయాన్ని ఆమె సఖి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి ఆమె విరహ వేదనలనన్నింటిని పూసగుచ్చినట్లు చెబుతోంది.
“జగన్నాథా! రాధ నీ కోసం పొదరింట్లో విరహవేదన చెందుతోంది. పరస్త్రీల అధరామృతాన్ని రహస్యంగా గ్రహిస్తూ, ఆనందిస్తున్న నీకోసం అన్ని దిక్కులా వెదకుతోంది. నీ దగ్గరకు రావాలని అడుగులు ముందుకు వేస్తోంది. కాని, నిన్ను కలుసుకోవాలనే తొందరలో, ఉద్వేగంతో ఆమె అడుగులు తడబడుతున్నాయి. నడువలేక విరహవేదనతో పడిపోతోంది.
తనను వివిధ ఆభరణాలతో అలంకరించుకుంటోంది. రతిక్రీడకై శ్రీహరి ఎందుకు రావడం లేదని అడుగుతోంది. కటిక చీకటినే హరిగా భావించి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటోంది. నీతో రతికేళి జరుపుతున్నట్టుగా భావించి రస సముద్రంలో తేలిపోతున్నది.  చెట్ల ఆకులు కదలితే నీవే వచ్చావనుకుంటోంది. శయన శయ్యను అలంకరిస్తోంది. గాఢకాంక్షతో నిన్ను ధ్యానిస్తోంది. నీతో పూర్వం జరిపిన రతి క్రీడలను జ్ఞాపకం చేసుకుంటోంది. నీ రాక ఆలస్యం కావడంతో రోదిస్తోంది. నీవు దగ్గర లేకపోవడం తో రాత్రి గడవడం లేదు” అని కృష్ణుని తొందరపెట్టింది.

ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.

 ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏

👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link

ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Scroll to Top