జయదేవ అష్టపది ప్రబంధః – 15 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
॥ ప్రబంధః – 15 ॥
(హరిరస మన్మథతిలకః)
(సావేరి – చాపు) (ఘూర్జరీ – ఏక)

ఘూర్జరీ రాగైక తాళీ తాళాభ్యాం గీయతే ।
సముదిత మదనే రమణీవదనే చుంబన వలితాధరే ।
మృగమదతిలకం లిఖతి సపులకం మృగమివ రజనీకరే ॥
రమతే యమునా పుళిన వనే విజయీ మురారిరధునా ॥ (ధ్రువమ్)॥
ఘన చయ రుచిరే రచయతి చికురే తరళిత తరుణాననే ।
కురవక కుసుమం చపలా సుషమం రతిపతి మృగకాననే ॥
ఘటయతి సుఘనే కుచయుగగగనే మృగమదరుచి రూషితే ।
మణివర మమలం తారకపటలం నఖపదశశి భూషితే ॥
జితబిసశకలే మృదుభుజయుగళే కరతల నళినీదళే ।
మరకత వలయం మధుకర నిచయం వితరతి హిమ శీతలే ॥
రతి గృహ జఘనే విపులాపఘనే మనసిజ కనకాసనే ।
మణి మయ రశనం తోరణ హసనం వికిరతి కృత వాసనే ॥
చరణ కిసలయే కమలానిలయే నఖమణిగణ పూజితే ।
బహిరపవరణం యావక భరణం జనయతి హృది యోజితే ॥
రమయతి సుదృశం కామపి సుభృశం ఖల హలధర సోదరే ।
కి మఫలమవసం చిరమిహ విరసం వద సఖి! విటపోదరే ॥
ఇహ రసభణనే కృత హరిగుణనే మధురిపు పద సేవకే ।
కలియుగ చరితం న వసతు దురితం కవినృప జయదేవకే ॥
నాయాతః సఖి నిర్దయో యది శఠస్త్వం దూతి! కిం దూయసే?
స్వచ్ఛందం బహువల్లభః స రమతే కిం తత్ర తే దూషణం?
పశ్యాద్యప్రియ సంగమాయ దయితస్యాకృష్యమాణం గుణైః
ఉత్కంఠార్తి భరాదివ స్ఫుటదిదం చేతః స్వయం యాస్యతి ॥ 6 ॥
భావము:
సఖీ! విజయుడైన మురారి యమునా నదీ తీరంలో ఇసుక తిన్నెల దగ్గర గల వనంలో క్రీడిస్తున్నాడు. ఒక సుందర వనిత ముఖాన్ని ముద్దు పెట్టుకొనేందుకు ఆమెను తన వైపుకు త్రిప్పుకొంటున్నాడు. ఆ సుందరి ముఖంపై కస్తూరిని అద్దుతున్నాడు. ఒక యువతి దట్టమైన కురులలో పువ్వును తురుముతున్నాడు. ఘనమైన కుచ కుంభాలపై కస్తూరిని ధరింపజేస్తున్నాడు.
ఆమె చేతులు పద్మ దళాల వలె ఉన్నాయి. కృష్ణుడు ఆమె భుజాలకు మరకత మణికంకణాన్ని తొడుగుతున్నాడు. శ్రీకృష్ణుడు ఆమె లేత పాదాలకు, ఎర్రని రంగు గల రసాన్ని పట్టిస్తున్నాడు. అవి ఆ కృష్ణుని వక్షస్థలాన్ని ఎర్రగా చేస్తున్నాయి. అతడు ఆ అందమైన గోపకాంతను ఆరాధిస్తుంటే, నేను అతనికోసం ఈ పొదరింట్లో నిస్సహాయంగా, నీరసంగా, నిరంతరం ఎదురుచూస్తూ కూచోవడం వృథాయే కదా! సఖీ! కృష్ణుడు దయలేనివాడై ఇక్కడికి రాకపోవడానికి నీవేల దుఃఖిస్తావు? ఆ కృష్ణుడు రాకపోతే నాకు దుఃఖంకాని, నీకేమిటి? ఆ శ్రీకృష్ణునికి ఎంతోమంది ప్రియురాళ్లున్నారు. వారితో తన యిష్టానుసారం క్రీడిస్తాడు. నీ పరితాపాన్ని బట్టి చూడగా ఆ కృష్ణునితో క్రీడించిన వారిలో నీవు కూడా ఓ ప్రియురాలయ్యావు కదా? ఆయన ఎంతటి మోసగాడు కాకపోతే నన్ను వదలివేసి, నా సందేశాన్ని తెచ్చిన నీతో ఎందుకు రమిస్తాడు? ఎంతో సంతోషం. దీనిలో నిన్ను దూషించేది ఏమీ లేదు.
ఆ శ్రీకృష్ణుడు నీ వంటివాళ్లతో సంభోగించడమే ప్రధానకార్యంగా ఎంచుకొని, ఇష్టప్రకారం సంచరించే బహువల్లభుడైనా, నాకేమీ నష్టంలేదు. కాని, అతడు నన్ను ప్రేమించింది మొదలుకొని వేరొక యువతిని మనస్సులో తలచుకోవడం కూడా తెలియనివాడు. అలాగే నేను కూడా పరపురుషుని మనస్సులో తలచుకోవడంలేదు. ఇప్పుడు, విధివశాన ఆ కృష్ణుడు నన్ను మరచిన ఈ సమయంలో నేను బ్రతకడంకంటే ప్రాణాలు వదలటమే శ్రేయస్కరమని భావిస్తున్నాను.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









