జయదేవ అష్టపది ప్రబంధః – 18 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
నవమః సర్గః – ముగ్ధ ముకుందః
తా మథ మన్మథ ఖిన్నాం
రతి రభస భిన్నాం విషాద సంపన్నాం
అనుచింతిత హరి చరితాం
కలహాంతరిత మువాచ రహసి సఖీ ॥1॥
॥ ప్రబంధః – 18 ॥
(అమందముకుందః)
(యదుకులకాంభోజి – ఆది) (రామకరీ -) (ఘూర్జరీ – యతి)

ఘూర్జరీ రాగ యతి తాళాభ్యాం గీయతే ।
హరిరభిసరతి వహతి మధు పవనే ।
కిమపరమధిక సుఖం సఖి! భవనే ॥
మాధవే మా కురు మానిని! మానమయే ॥ (ధ్రువమ్) ॥
తాళ ఫలాదపి గురుమతిసరసం ।
కిము విఫలీ కురుషే కుచ కలశమ్ ॥
కతి న కథితమిద మనుపద మచిరం ।
మా పరిహర హరిమతిశయ రుచిరమ్ ॥
కిమితి విషీదసి రోదిషి వికలా ।
విహసతి యువతి సభా తవ సకలా ॥
మృదు నళినీదళ శీతల శయనే ।
హరిమవలోకయ సఫలయ నయనే ॥
జనయసి మనసి కిమితి గురు ఖేదం ।
శృణు మమ వచన మనీహిత భేదమ్ ॥
హరిరుపయాతు వదతు బహు మధురం ।
కిమితి కరోషి హృదయమతివిధురమ్ ॥
శ్రీ జయదేవ భణిత మతిలలితం ।
సుఖయతు రసిక జనం హరి చరితమ్ ॥
స్నిగ్ధే యత్పరుషాఽసి యత్ప్రణమతి స్తబ్ధాఽసి యద్రాగిణి
ద్వేషస్థాఽసి యదున్ముఖే విముఖతాం యాతాఽసి తస్మిన్ప్రియే ।
తద్యుక్తం విపరీత కారిణి తవ శ్రీ ఖండ చర్చా విషం
శీతాంశుస్తపనో హిమం హుతవహః క్రీడా ముదో యాతనాః ॥ 2॥
సాంద్రానంద పురందరాది దివిషద్బృందై రమందాదరాత్
ఆనమ్రైర్మకుటేంద్ర నీల మణిభిః సందర్శితేందిందిరం ।
స్వచ్ఛందం మకరంద సుందర మిళన్మందాకినీ మేదురం
శ్రీ గోవింద పదారవిందమశుభ స్కందాయ వందామహే ॥ 3 ॥
ఇతి శ్రీ జయదేవకృతౌ గీతగోవిందే
కలహాంతరితావర్ణనే ముగ్ధ ముకుందో నామ నవమ సర్గః॥
భావము:
ప్రణయకోపంచే శ్రీకృష్ణుని నిందించి బాధపడుతున్న రాధతో చెలికత్తె ఇలా చెబుతోంది.
“సఖీ! మాధవునిపట్ల కోపం వహించకు. వసంతకాల సమీరం వచ్చే సమయంలో శ్రీహరి రహస్య ప్రదేశానికి వెళ్ళాడు. నీకు ఇంత కంటే సుఖప్రదమైన శుభవార్త మరేముంది చెప్పు. రాధా! స్వీయం కృతాపరాధం వలన కలిగిన కష్టానికి చింతించడం దేనికి? నీ విపరీత కార్యాలే నిన్నింతవరకు తెచ్చాయి! నీ ప్రియుడు సరసుడై నీ దగ్గరకు వచ్చినప్పుడు నీవేల కఠినురాలైనావు? నీ ప్రియుడు మాధవుడు నీ పట్ల ఇంతటి అనురాగాన్ని చూపుతున్నా, నీవు అతనిని ఎందుకు ద్వేషిస్తున్నావు? ఇలాంటి నీ ప్రవర్తన వల్ల చందనం విషంగాను, చల్లని కిరణాల చంద్రుడు సూర్యునిగాను, మంచు అగ్నిగాను మారడంలో ఆశ్చర్యం ఏముంది? శ్రీహరికి ఎందుకు దూరమవుతావు? అతణ్ణి ఎన్నటికీ పరిత్యజించకు. ఈ విషయమే నేను నీకు ఎంతగానో, ఎన్నో సార్లు చెపుతూనే వున్నాను. ఎందుకు దుఃఖిస్తున్నావు? ఇది చూచి నీ స్నేహితురాళ్ళు హేళన చేస్తూ నవ్వుకొంటున్నారు చూడు. నీటి తుంపరలతో చల్లని తామరాకుల శయ్యపై పవళించి ఉన్న ఆ శ్రీహరిని సేవించి, జీవితాన్ని సఫలం చేసుకో.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









