జయదేవ అష్టపది ప్రబంధః – 21 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
॥ ప్రబంధః – 21 ॥
(సానందదామోదర ప్రేమద్రుమపల్లవః)
(బంగాళవరాళి – రూపక) (ఘంటా – జంపె)

వరాళీ రాగ రూపక తాళాభ్యాం గీయతే ।
మంజుతర కుంజ తల కేళి సదనే ।
ఇహ విలస రతి రభస హసిత వదనే ॥
ప్రవిశ రాధే! మాధవ సమీపమిహ
కురు మురారే! మంగళశతాని ॥ (ధ్రువమ్) ॥
నవ లసదశోక దళ శయన సారే ।
ఇహ విలస కుచ కలశ తరళ హారే ॥
కుసుమ చయ రచిత శుచి వాస గేహే ।
ఇహ విలస కుసుమ సుకుమార దేహే ॥
మృదు చల మలయ పవన సురభి శీతే ।
ఇహ విలస మదన శర నికర భీతే ॥
వితత బహువల్లి నవ పల్లవ ఘనే ।
ఇహ విలస పీనకుచ కుంభ జఘనే ॥
మధు ముదిత మధుప కుల కలిత రావే ।
ఇహ విలస కుసుమశర సరస భావే ॥
మధురతర పిక నికర నినద ముఖరే ।
ఇహ విలస దశన రుచి రుచిర శిఖరే ॥
విహిత పద్మావతి సుఖ సమాజే ।
భణతి జయదేవ కవి రాజ రాజే ॥
త్వాం చిత్తేన చిరం వహన్నయమతి శ్రాంతో భృశం తాపితః
కందర్పేణ చ పాతుమిచ్ఛతి సుధా సంబాధ బింబాధరం ।
అస్యాంకం తదలంకురు క్షణమిహ భ్రూ క్షేప లక్ష్మీ లవ
క్రీతే దాస ఇవోపసేవిత పదాంభోజే కుతః సంభ్రమః ॥ 5॥
సా ససాధ్వస సానందం గోవిందే లోల లోచనా ।
శింజాన మంజు మంజీరం ప్రవివేశ నివేశనమ్ ॥ 6॥
భావము:
హారాల్లో గల మణుల కాంతి, మంజీర కంకణాల కాంతితో చీకటి తొలగిపోగా, శ్రీహరిని చూచి సిగ్గు పడుతున్న రాధను చూచి సఖి ఆమెలోని సిగ్గు, భయాలను పోగొట్టడానికి ఇలా అంటోంది.
“సుందర వదనంగల ఓ రాధా! మాధవుని సమీపించు. పువ్వులతో అలంకరించబడ్డ శుభ్రమైన శయన గృహంలోకి ప్రవేశించు. మృదువైన మలయ మారుత పరిమళాలను, తీగల, లతల సౌందర్యాన్ని, పొదరింటిలో అనుభవించి, ఆనందించు. స్వామి మన్మథ బాధా పీడితుడై నిన్ను చిరకాలం తలచి తలచి అలసిపోయాడు. నీ అధర సుధామృతపానం చేయాలనే కోరికతో ఉన్నాడు. క్షణకాలం ఆయన వక్షస్థలంపై సేదదీరు. నీ పాదాక్రాంతుడైన అతని వలన నీకు భయమెందుకు?” అని పలికింది.
తరువాత ఆ రాధ క్రీగంటి చూపులతో కృష్ణుని చూస్తూ భయంతో, ఆనందంతో, కాలి అందెలు ఘల్లుఘల్లుమనగా కేళీమందిరంలోనికి ప్రవేశించింది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
జయదేవుని అష్టపదులు
ప్రథమః సర్గః – సామోద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్
ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః
జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్
తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః
పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః
జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః
షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః
జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్

సప్తమః సర్గః – నాగర నారాయణః
జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః
అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః
జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ
నవమః సర్గః – ముగ్ధ ముకుందః
జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

దశమః సర్గః – చతుర చతుర్భుజః
జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః
ఏకాదశః సర్గః – సానంద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః
జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









