జయదేవ అష్టపది ప్రబంధః – 22 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
॥ ప్రబంధః – 22 ॥
(సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః)
(మాళవ – ఆది) (మధ్యమావతి – ఆది)

వరాళీ రాగ యతి తాళాభ్యాం గీయతే ।
రాధా వదన విలోకన వికసిత వివిధ వికార విభంగం ।
జల నిధిమివ విధు మండల దర్శన తరళిత తుంగ తరంగమ్ ॥
హరిమేక రసం చిరమభిలషిత విలాసం ।
సా దదర్శ గురు హర్ష వశంవద వదనమనంగ నివాసమ్ ॥ (ధ్రువమ్) ॥
హారమమలతర తారమురసి దధతం పరిలంబ్య విదూరం ।
స్ఫుటతర ఫేన కదంబ కరంబితమివ యమునా జల పూరమ్ ॥
శ్యామళ మృదుళ కళేబర మండలమధిగత గౌర దుకూలం ।
నీల నళినమివ పీత పరాగ పటల భర వలయిత మూలమ్ ॥
తరళ దృగంచల చలన మనోహర వదన జనిత రతి రాగం ।
స్ఫుట కమలోదర ఖేలిత ఖంజన యుగమివ శరది తడాగమ్ ॥
వదన కమల పరిశీలన మిళిత మిహిర సమ కుండల శోభం ।
స్మిత రుచి రుచిర సముల్లసితాధర పల్లవ కృత రతి లోభమ్ ॥
శశి కిరణ చ్ఛురితోదర జలధర సుందర సకుసుమ కేశం ।
తిమిరోదిత విధు మండల నిర్మల మలయజ తిలక నివేశమ్ ॥
విపుల పులక భర దంతురితం రతి కేళి కలాభిరధీరం ।
మణి గణ కిరణ సమూహ సముజ్జ్వల భూషణ సుభగ శరీరమ్ ॥
శ్రీ జయదేవ భణిత విభవ ద్విగుణీకృత భూషణ భారం ।
ప్రణమత హృది వినిధాయ హరిం సుచిరం సుకృతోదయ సారమ్ ॥
అతిక్రమ్యాపాంగం శ్రవణ పథ పర్యంత గమన
ప్రయాసేనేవాక్ష్ణో స్తరళతర భావం గమితయోః ।
ఇదానీం రాధాయాః ప్రియతమ సమాలోక సమయే
పపాత స్వేదాంబు ప్రసర ఇవ హర్షాశ్రు నికరః ॥ 7 ॥
భజంత్యా స్తల్పాంతం కృత కపట కండూతి పిహిత
స్మితం యాతే గేహాద్బహిరవహితాళీ పరిజనే ।
ప్రియాస్యం పశ్యంత్యాః స్మర పరవశాకూత సుభగం
సలజ్జా లజ్జాఽపి వ్యగమదివ దూరం మృగదృశః ॥ 8 ॥
సానందం నంద సూనుర్దిశతు పరతరం సమ్మదం మంద మందం
రాధామాధాయ బాహ్వోర్వివరమను దృఢం పీడయన్ప్రీతి యోగాత్ ।
తుంగౌ తస్యా ఉరోజావతను వరతనోర్నిర్గతౌ మా స్మ భూతాం
పృష్ఠం నిర్భిద్య తస్మాద్బహిరితి వలిత గ్రీవమాలోకయన్వః ॥ 9 ॥
జయ శ్రీ విన్యస్తైర్మహిత ఇవ మందార కుసుమైః
స్వయం సిందూరేణ ద్విప రణ ముదా ముద్రిత ఇవ ।
భుజాపీడ క్రీడా హత కువలయాపీడ కరిణః
ప్రకీర్ణాసృగ్బిందుర్జయతి భుజ దండో మురజితః ॥ 10 ॥
సౌందర్యైకనిధే రనంగ లలనా లావణ్య లీలా జుషో
రాధాయా హృది పల్వలే మనసిజ క్రీడైక రంగ స్థలే ।
రమ్యోరోజ సరోజ ఖేలన రసిత్వాదాత్మనః ఖ్యాపయన్
ధ్యాతుర్మానస రాజ హంస నిభతాం దేయాన్ముకుందో ముదమ్ ॥ 11 ॥
ఇతి శ్రీజయదేవకృతౌ గీతగోవిందే
రాధికామిలనే సానందదామోదరోనామ ఏకాదశస్సర్గః॥
భావము:
రాధ భయంతో, ఆనందంతో, మంజులమైన అందెల సవ్వడులతో పొదరింటిలోకి ప్రవేశించి, తన కోసం తపిస్తూ, తనను చూసి ఆనందించిన కృష్ణుని చూచింది. పీతాంబరధరుడైన ఆ నల్లని మృదువైన స్వామి, అందమైన కనులు కలిగిన ముఖంతో, రతిలో ఆసక్తి కల మన్మధుని వలె రాధకు కన్పించాడు.
నల్లని కేశాల మధ్య తెల్లని పువ్వులతో శ్రీహరి వెన్నెలతో మెరిసిపోయే నల్లని మేఘంలా, చీకటిలో ఉదయించిన చంద్రునిలా, నల్లని ముఖం మీద తెల్లని చందన తిలకం ధరించి ఉన్నాడు. పూలతో, మణిమయ భూషణాలతో అలంకరించబడి తేజోమయుడుగా ప్రకాశిస్తున్నాడు. రాధామాధవుల సంగమాభిలాషను గమనించిన చెలికత్తెలు పొదరింటిని వదలి చీకటిలోకి జారుకున్నారు. రాధ బిడియం వీడి శ్రీకృష్ణుని దరిజేరి తన మనోవాంఛను తెలియజేసింది.
ఆనందంతో శ్రీకృష్ణుడు సౌందర్య శృంగార రూపిణి అయిన రాధను తన కౌగిలిలోకి తీసుకున్నాడు. రాధ శ్రీకృష్ణుని కౌగిలించినపుడు ఆమె హారం శ్రీకృష్ణునిపై పడింది. రాధ శ్రీకృష్ణుని సేవించిన సమయంలో, అనురాగ భావంతో తన కన్నులందు ప్రవాహంవలె ఆనందబాష్పాలు ప్రవహించాయి. అప్పుడు పరిజనులైన చెలికత్తెలందరూ ఒకరొకరు పొదరింటి నుండి వెలుపలికి పోగా, రాధ, చిరునవ్వును పంటి నడుమ అదిమిపట్టుకొని, సుందరమైన శ్రీకృష్ణునిముఖాన్ని ప్రేమతో చూస్తూ ఉండిపోయింది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
జయదేవుని అష్టపదులు
ప్రథమః సర్గః – సామోద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్
ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః
జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్
తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః
పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః
జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః
షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః
జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్

సప్తమః సర్గః – నాగర నారాయణః
జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః
అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః
జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ
నవమః సర్గః – ముగ్ధ ముకుందః
జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

దశమః సర్గః – చతుర చతుర్భుజః
జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః
ఏకాదశః సర్గః – సానంద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః
జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









