జయదేవ అష్టపది ప్రబంధః – 23 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః
గతవతి సఖీ బృందేఽమంద త్రపాభర నిర్భర
స్మర పరవశాకూత స్ఫీత స్మిత స్నపితాధరం ।
సరస మనసం దృష్ట్వా రాధాం ముహుర్నవ పల్లవ
ప్రసవ శయనే నిక్షిప్తాక్షీమువాచ హరిః ప్రియామ్ ॥ 1 ॥
॥ ప్రబంధః – 23 ॥
(మధురిపు విద్యాధరలీలః)
(విభాస – ఆది) (నాదనామక్రియ -)

విభాస రాగైకతాళీ తాళాభ్యాం గీయతే ।
కిసలయశయన తలే కురు కామిని! చరణ నళిన వినివేశం ।
తవ పద పల్లవ వైరి పరాభవమిదమనుభవతు సువేశమ్ ॥
క్షణ మధునా నారాయణ మనుగత మనుసర రాధికే ॥ (ధ్రువమ్) ॥
కర కమలేన కరోమి చరణమహ మాగమితాఽసి విదూరం ।
క్షణముపకురు శయనోపరి మామివ నూపురమనుగతి శూరమ్ ॥
వదన సుధా నిధి గళితమమృతమివ రచయ వచనమనుకూలం ।
విరహమివాపనయామి పయోధర రోధకమురసి దుకూలమ్ ॥
ప్రియ పరిరంభణ రభస వలితమివ పులకిత మతిదురవాపం ।
మదురసి కుచ కలశం వినివేశయ శోషయ మనసిజ తాపమ్ ॥
అధర సుధా రసముపనయ భామిని! జీవయ మృతమివ దాసం ।
త్వయి వినిహిత మనసం విరహానల దగ్ధ వపుషమవిలాసమ్ ॥
శశిముఖి! ముఖరయ మణి రశనా గుణమనుగుణ కంఠ నినాదం ।
శ్రుతి యుగళే పిక రుత వికలే మమ శమయ చిరాదవసాదమ్ ॥
మామతివిఫల రుషా వికలీకృత మవలోకితు మధు నేదం ।
లజ్జితమివ నయనం తవ విరమతి విసృజ వృథా రతి ఖేదమ్ ॥
శ్రీ జయదేవ భణితమిద మనుపద నిగదిత మధురిపు మోదం ।
జనయతు రసిక జనేషు మనోరమ రతి రస భావ వినోదమ్ ॥
(సురతారంభ చంద్రహాసః)
ప్రత్యూహః పులకాంకురేణ నిబిడాశ్లేషే నిమేషేణ చ
క్రీడాకూత విలోకితేఽధర సుధాపానే కథానర్మభిః ।
ఆనందాధిగమేన మన్మథ కలా యుద్ధేఽపి యస్మిన్నభూత్
ఉద్భూతః స తయోర్బభూవ సురతారంభః ప్రియంభావుకః ॥ 2 ॥
(కామతృప్త కామినీహాసః)
దోర్భ్యాం సంయమితః పయోధర భరేణాపీడితః పాణిజై
రావిద్ధో దశనైః క్షతాధర పుటః శ్రోణీ తటేనాహతః ।
హస్తేనానమితః కచేఽధర మధు స్యందేన సమ్మోహితః
కాంతః కామపి తృప్తిమాప తదహో! కామస్య వామా గతిః ॥ 3 ॥
(పౌరుషరస ప్రేమవిలాసః)
మారాంకే రతి కేళి సంకుల రణారంభే తయా సాహస
ప్రాయం కాంత జయాయ కించిదుపరి ప్రారంభి యత్సంభ్రమాత్ ।
నిష్పందా జఘన స్థలీ శిథిలితా దోర్వల్లిరుత్కంపితం
వక్షో మీలితమక్షి పౌరుష రసః స్త్రీణాం కుతః సిధ్యతి ॥ 4॥
(కామాద్భుతాభినవ మృగాంకలేఖనః)
తస్యాః పాటల పాణిజాంకితమురో నిద్రా కషాయే దృశౌ
నిర్ధౌతోఽధర శోణిమా విలుళితాః స్రస్తాః స్రజో మూర్ధజాః ।
కాంచీదామ దర శ్లథాంచలమితి ప్రాతర్నిఖాతైర్దృశో
రేభిః కామశరై స్తదద్భుత మభూత్పత్యుర్మనః కీలితమ్ ॥ 5 ॥
వ్యాలోలః కేశ పాశస్తరళితమలకైః స్వేద మోక్షౌ కపోలౌ
క్లిష్టా బింబాధర శ్రీః కుచ కలశ రుచా హారితా హార యష్టిః ।
కాంచీ కాంతిర్హతాశా స్తన జఘన పదం పాణినాచ్ఛాద్య సద్యః
పశ్యంతీ సత్రపా సా తదపి విలుళితా ముగ్ధ కాంతిర్ధినోతి ॥ 6 ॥
ఈషన్మీలిత దృష్టి ముగ్ధ విలసత్సీత్కార ధారా వశాత్
అవ్యక్తాకుల కేళి కాకు వికసద్దంతాంశు ధౌతాధరం ।
శాంత స్తబ్ధ పయోధరం భృశ పరిష్వంగాత్కురంగీ దృశో
హర్షోత్కర్ష విముక్త నిఃసహ తనోర్ధన్యో ధయత్యాననమ్ ॥ 7 ॥
అథ సహసా సుప్రీతం సురతాంతే సా నితాంత ఖిన్నాంగీ ।
రాధా జగాద సాదర మిద మానందేన గోవిందమ్ ॥ 8 ॥
భావము:
చెలికత్తెలందరు రాధను పొదరింటిలో విడిచి దూరంగా తొలగిపోగా ఆమె ఎంతో సిగ్గుపడి పెదవిపై చిరునవ్వు మొలకెత్తగా మాటిమాటికి లేత చివుళ్లుగల పూలచేత తయారుచేయబడిన పాన్పును చూస్తూ, నిలబడియుండగా చిరకాల వియోగతాపంతో ఉన్న కృష్ణుడు ప్రియురాలైన రాధతో ఇలా అంటున్నాడు.
“ఓ రాధికా! అప్పుడే వికసించిన పువ్వులకన్నా మృదువైన నీ పాదాలను ఈ పూలపాన్సుపై ఉంచి, ఈ పూవుల గర్వాన్ని అణిచి వేయి. ఈ నారాయణుని నారీసహితునిగా చేయి. చాలా దూరం నుండి వచ్చి ఎంతో అలసిన నీవు ఈ శయ్యపై పవళించినట్లయితే, నా చేతులతో నీకు పరిచర్య చేస్తాను.
చంద్రుని అమృత కిరణాల కన్నా మధురాతిమధురమైన నీ పలుకులతో నన్ను రంజిల్ల చేయి. నీ కౌగిలిలో నా దుర్భర మదన తాపాన్ని దూరం చేయి. విరహాగ్నితో దహించుకుపోయిన నన్ను, నీ మధుర అధరామృతంతో పునరుజ్జీవింపజేయి. నీ శ్రావ్యమైన మాటలతో, అందియల తాళాలతో ఆనందింప జేయి. ఇక ఆలస్యం చేయక నా దరిజేరు” అని పలికాడు.
రాధా కృష్ణులు అనురాగ భరితులై, కౌగిలింతలతో, చుంబనాలతో బాహ్య ప్రపంచాన్ని మరిచారు. మన్మథకేళిలో నిమగ్నులైపోయారు. రాధాకృష్ణుల బాధలు తొలగి, ఆనందానికి హద్దులు చెరిగిపోయాయి. సంభోగానంతరం రాధాకృష్ణులు పరస్పరం అత్యంత ఆనందం పొందినవారయ్యారు. తరువాతి కృత్యాలను రాధ కృష్ణునితో చెబుతున్నది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
జయదేవుని అష్టపదులు
ప్రథమః సర్గః – సామోద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 1 | దశావతారకీర్తి ధవళమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 2 | హరివిజయ మంగళాచారమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 3 | మాధవోత్సవ కమలాకరమ్
జయదేవ అష్టపది ప్రబంధః – 4 | సామోద దామోదర భ్రమర పదమ్
ద్వితీయః సర్గః – అక్లేశ కేశవః
జయదేవ అష్టపది ప్రబంధః – 5 | మధురిపు రత్నకంఠిక
జయదేవ అష్టపది ప్రబంధః – 6 | అక్లేశకేశవ మంజరీతిలకమ్
తృతీయః సర్గః – ముగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 7 |ముగ్ధమధుసూదన హంసక్రీడనమ్

చతుర్థః సర్గః – స్నిగ్ధ మధుసూదనః
జయదేవ అష్టపది ప్రబంధః – 8 | హరివల్లభాశోక పల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 9 | స్నిగ్ధ మధుసూదన రాసావలయః
పంచమః సర్గః – సాకాంక్ష పుండరీకాక్షః
జయదేవ అష్టపది ప్రబంధః – 10 | హరిసముదయ గరుడపదః
జయదేవ అష్టపది ప్రబంధః – 11 | సాకాంక్ష పుండరీకాక్షోత్కంఠా మధురః
షష్ఠః సర్గః – సోత్కంఠ వైకుంఠః
జయదేవ అష్టపది ప్రబంధః – 12 | ధన్య వైకుంఠ కుంకుమమ్

సప్తమః సర్గః – నాగర నారాయణః
జయదేవ అష్టపది ప్రబంధః – 13 | నాగర నారాయణ రాసావలయః
జయదేవ అష్టపది ప్రబంధః – 14 | హరి రమిత చంపకశేఖరః
జయదేవ అష్టపది ప్రబంధః – 15 | హరిరస మన్మథతిలకః
జయదేవ అష్టపది ప్రబంధః – 16 | నారాయణ మదనాయాసః
అష్టమః సర్గః – విలక్ష్య లక్ష్మీపతిః
జయదేవ అష్టపది ప్రబంధః – 17 | లక్ష్మీపతి రత్నావళీ
నవమః సర్గః – ముగ్ధ ముకుందః
జయదేవ అష్టపది ప్రబంధః – 18 | అమందముకుందః

దశమః సర్గః – చతుర చతుర్భుజః
జయదేవ అష్టపది ప్రబంధః – 19 | చతురచతుర్భుజ రాగరాజి చంద్రోద్యోతః
ఏకాదశః సర్గః – సానంద దామోదరః
జయదేవ అష్టపది ప్రబంధః – 20 | శ్రీహరితాళరాజి జలధరవిలసితః
జయదేవ అష్టపది ప్రబంధః – 21 | సానందదామోదర ప్రేమద్రుమపల్లవః
జయదేవ అష్టపది ప్రబంధః – 22 | సానందగోవింద రాగశ్రేణి కుసుమాభరణః

ద్వాదశః సర్గః – సుప్రీత పీతాంబరః
జయదేవ అష్టపది ప్రబంధః – 23 | మధురిపు విద్యాధరలీలః
జయదేవ అష్టపది ప్రబంధః – 24| సుప్రీతపీతాంబర తాళశ్రేణీ
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









