జయదేవ అష్టపది ప్రబంధః – 3 | గీత గోవిందం తెలుగులో అర్థం
జయదేవ అష్టపది భారతీయ భక్తి సాహిత్యంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దివ్య కవితా సంపద. దీనిని 12వ శతాబ్దానికి చెందిన మహాకవి జయదేవుడు సంస్కృతంలో రచించారు. ఈ అష్టపదులు ఆయన అమర గ్రంథమైన గీత గోవిందంలో భాగంగా ఉన్నాయి.
“అష్టపది” అంటే ఎనిమిది పాదాలతో కూడిన గీతం. మొత్తం 24 అష్టపదులు గీత గోవిందంలో ఉన్నాయి. ప్రతి అష్టపది శ్రీకృష్ణుడు మరియు శ్రీరాధాదేవి మధ్యనున్న దివ్య ప్రేమ, విరహం, కలయిక, భక్తి, శరణాగతి వంటి ఆధ్యాత్మిక భావాలను అద్భుతమైన కవిత్వంతో చిత్రిస్తుంది.
జయదేవుని కవిత్వంలో శృంగారరసం కేవలం భౌతిక ప్రేమను సూచించదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకోవాలనే ఆత్మీయ తపనకు ప్రతీక. రాధా జీవాత్మకు, శ్రీకృష్ణుడు పరమాత్మకు ప్రతిరూపంగా భావించబడతారు. అందువల్ల గీత గోవిందం భక్తి, సంగీతం, నృత్యం మరియు సాహిత్య రంగాల్లో అపూర్వమైన స్థానం సంపాదించింది.
ఈ అష్టపదులను భారతదేశంలోని అనేక దేవాలయాల్లో, ముఖ్యంగా శ్రీకృష్ణ ఆలయాలలో, భక్తితో ఆలపిస్తారు. ఒడిస్సీ, భరతనాట్యం, కూచిపూడి, కథక్ వంటి భారతీయ శాస్త్రీయ నృత్య సంప్రదాయాలలో కూడా వీటికి విశిష్టమైన ప్రాధాన్యం ఉంది.
ఈ శ్రేణిలో ప్రతి అష్టపదిని సంస్కృత శ్లోకంతో పాటు పదచ్ఛేదం, పదార్థం, తాత్పర్యం మరియు సులభమైన తెలుగు వివరణతో తెలుసుకుందాం. జయదేవ మహాకవి ఆవిష్కరించిన రాధాకృష్ణుల దివ్య ప్రేమ రహస్యాన్ని, భక్తి తత్వాన్ని మరియు గీత గోవిందం యొక్క ఆధ్యాత్మిక సౌందర్యాన్ని కలిసి ఆస్వాదిద్దాం.
॥ ప్రబంధః – 3 ॥
(మాధవోత్సవ కమలాకరమ్)
(వసంత – ఆది)

వసంత రాగ యతి తాళాభ్యాం గీయతే ।
లలిత లవంగ లతా పరిశీలన కోమల మలయ సమీరే ।
మధుకర నికర కరంబిత కోకిల కూజిత కుంజ కుటీరే ॥
విహరతి హరిరిహ సరస వసంతే నృత్యతి
యువతీ జనేన సమం సఖి! విరహి జనస్య దురంతే ॥ (ధ్రువమ్) ॥
ఉన్మద మదన మనోరథ పథిక వధూజన జనిత విలాపే ।
అలి కుల సంకుల కుసుమ సమూహ నిరాకుల వకుళ కలాపే ॥
మృగమద సౌరభ రభస వశంవద నవదళ మాల తమాలే ।
యువజన హృదయ విదారణ మనసిజ నఖ రుచి కింశుక జాలే ॥
మదన మహీపతి కనక దండ రుచి కేసరకుసుమ వికాసే ।
మిళిత శిలీముఖ పాటల పటల కృత స్మర తూణ విలాసే ॥
విగళిత లజ్జిత జగదవలోకన తరుణ కరుణ కృత హాసే ।
విరహి నికృంతన కుంత ముఖాకృతి కేతక దంతురితాశే ॥
మాధవికా పరిమళ లలితే నవ మాలతి జాతి సుగంధౌ ।
ముని మనసామపి మోహనకారిణి తరుణా కారణ బంధౌ ॥
స్ఫురదతిముక్త లతా పరిరంభణ ముకుళిత పులకిత చూతే ।
బృందావన విపినే పరిసర పరిగత యమునా జల పూతే ॥
శ్రీ జయదేవ భణితమిద ముదయతి హరి చరణ స్మృతి సారం ।
సరస వసంతసమయ వనవర్ణన మనుగత మదన వికారమ్ ॥
దర విదళిత మల్లీ వల్లి చంచత్పరాగ
ప్రకటిత పట వాసైర్వాసయన్కాననాని ।
ఇహ హి దహతి చేతః కేతకీ గంధ బంధుః
ప్రసర దసమబాణ ప్రాణవద్గంధవాహః ॥ 8 ॥
ఉన్మీలన్మధు గంధ లుబ్ధ మధుప వ్యాధూత చూతాంకుర
క్రీడత్కోకిల కాకలీ కలరవై రుద్గీర్ణ కర్ణ జ్వరాః ।
నీయంతే పథికైః కథం కథమపి ధ్యానానుధాన క్షణ
ప్రాప్త ప్రాణసమా సమాగమ రసోల్లాసై రమీ వాసరాః ॥ 9 ॥
అనేక నారీ పరిరంభ సంభ్రమ
స్ఫురణ్మనోహారి విలాస లాలసం ।
మురారిమారా దుపదర్శయంత్యసౌ
సఖీ సమక్షం పునరాహ రాధికామ్ ॥ 10 ॥
భావము:
వసంతకాలంలో కృష్ణుడు దగ్గరలేనందున విరహతాపాన్ని తాళలేక, బాధ పడుతూ, అవయవ సౌకుమార్యంతో, ముగ్ధమోహనంగా రూపుదిద్దుకున్న రాధ అరణ్యంలో శ్రీకృష్ణుని వెతుకుతోంది. రాధను చూసి, ఓదార్చాలనుకొని, ఆమె చెలికత్తె ఈ విధంగా చెప్పసాగింది.
“లలితాలైన లవంగ తీగలపై నుండి చల్లని గాలులు వీస్తున్నాయి. కోకిలలు మధురంగా కూస్తున్నాయి. తుమ్మెదలు గల పుష్పగుచ్ఛాలతో, తేజోమయమైన వృక్షాలతో విరాజిల్లే బృందావనంలో, ఈ వసంత ఋతువులో, శ్రీకృష్ణుడు ప్రియురాళ్ళతో ఆడుతూ పాడుతూ వినోద విహారం చేస్తున్నాడు. రాధా! అలాంటి అద్భుతమైన ప్రదేశానికి పోదాం రా” అని ఆ చెలికత్తె కొంచెం దూరంలో అనేక స్త్రీలతో కూడి శృంగారవిలాసాలను అనుభవిస్తున్న శ్రీకృష్ణుని చూపిస్తూ రాధ చెలికత్తె ఆమెపై సరసోక్తులు వెదజల్లుతోంది.
ఇలాంటి మరిన్ని స్తోత్రాలు, శ్లోకాలు, భక్తి విషయాల కోసం మా వెబ్‌సైట్‌లోని ఇతర పోస్ట్‌లను తప్పక చూడండి.
ఎన్నో స్తోత్రాలు, వాటి అర్థాలు తెలుగులో తెలుసుకోవాలనుకుంటే మన “భారతీయ సంస్కృతి” YouTube ఛానల్‌ను సందర్శించండి. 🙏
👉 భారతీయ సంస్కృతి YouTube Channel Link
ఈ సమాచారాన్ని వీడియొ రూపంలో చూడాలనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేసి వీడియొ చూడండి 👇👇👇. మరెంతో ఆధ్యాత్మిక, ధార్మిక సమాచారం కోసం భారతీయ సంస్కృతి ఛానల్ ను subscribe చేసుకోండి.









