వైశాఖ పురాణము
నారద మహర్షి తాను పూర్వం బ్రహ్మ దేవుని దగ్గర నుండి దగ్గర మాసాల మహిమ గురించి తెలుసుకున్నానని చెప్పాడు. శ్రీహరి లక్ష్మీ దేవికి మాసధర్మాలను వివరించాడని, ఆ దివ్యమైన విషయాలను ఇప్పుడు అంబరీషునికి వివరిస్తున్నాడు.
అన్ని మాసాలలో కార్తీక, మాఘ, వైశాఖ మాసాలు అత్యంత శ్రేష్ఠమైనవి. వాటిలో వైశాఖ మాసం అత్యుత్తమమైనది. ఈ మాసం సర్వశుభాలను ప్రసాదిస్తుంది. ఈ కాలంలో చేసే స్నానాలు, పూజలు, దానాలు పాపాలను తొలగించి పుణ్యాన్ని పెంచుతాయి. దేవతలు కూడా ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలను గౌరవిస్తారు.
అన్ని విద్యల్లో వేదవిద్య, మంత్రాల్లో ఓంకారం, వృక్షాల్లో కల్పవృక్షం, ధేనువుల్లో కామధేనువు, సర్పాల్లో శేషుడు, పక్షుల్లో గరుత్మంతుడు, దేవతల్లో శ్రీహరి, వర్ణాల్లో బ్రాహ్మణుడు, నదుల్లో గంగానది, కాంతిలో సూర్యుడు, ఆయుధాల్లో చక్రం, లోహాల్లో బంగారం — ఇవన్నీ ఎలా శ్రేష్ఠమైనవో, అలాగే ధర్మములన్నిటిలో వైశాఖ మాసం అత్యున్నతమైనది. అందుకే దీనిని మాధవ మాసం అని కూడా అంటారు.
ఈ మాసంలో సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు, సూర్యోదయానికి ముందుగా నదుల్లో స్నానం చేస్తే శ్రీహరి లక్ష్మీ దేవితో కలిసి భక్తులను ఆనందంతో ఆశీర్వదిస్తాడు.
ఈ మాసంలో ఒక్కసారైనా స్నానం, పూజ చేసినా పాప విముక్తి లభించి విష్ణులోకం చేరుతారు. ఒక వారం పాటు ఆచరించినా వేలాది అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది. స్నానం చేయలేని పరిస్థితిలో ఉన్నా, దృఢమైన సంకల్పం ఉన్నవారికి కూడా మహా పుణ్యం లభిస్తుంది. నదీ స్నానం చేయలేకపోయినా, ఆ సంకల్పంతో కొంత దూరం ప్రయాణించినా విష్ణుసాన్నిధ్యం లభిస్తుంది.
అందువల్ల వైశాఖ మాసం శ్రీహరికు అత్యంత ప్రీతికరమైనది. ఈ మాసంలో పుణ్యకార్యాలు చేయడం వల్ల పాపాలు తొలగి, విష్ణు అనుగ్రహం లభిస్తుంది. స్నానం చేయలేకపోయినా సంకల్పం దృఢంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైనది.
ఇలా నారద మహర్షి అంబరీషునికి వైశాఖ మాస మహిమను వివరిస్తూ, వైశాఖ పురాణాన్ని వివిధ అధ్యాయాలుగా వివరించాడు.
వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞనాశము కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూరజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏

