వైశాఖ పురాణం 6 వ అధ్యాయము
నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మాసం గొప్పతనాన్ని వివరిస్తూ, ఒక ఆశ్చర్యకరమైన కథను చెప్పారు. పూర్వం ఇక్ష్వాకు వంశంలో హేమాంగదుడు అనే రాజు ఉండేవాడు. ఆయన లెక్కలేనన్ని గోదానాలు, భూదానాలు, యజ్ఞాలు చేశాడు. అయితే ఆయన రెండు తప్పులు చేశాడు. “నీరు అనేది ప్రకృతి సిద్ధంగా అందరికీ దొరికేది కదా, దాన్ని దానం చేయడం ఏంటి?” అని తక్కువగా చూశాడు. తన గురువైన వశిష్ఠ మహర్షి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. జ్ఞానులను, వేద పండితులను గౌరవించలేదు. జలదానం చేయకపోవడం, జ్ఞానులను అవమానించడం వల్ల హేమాంగదుడు చనిపోయాక చాలా కష్టాలు అనుభవించాడు. మూడుసార్లు చాతక పక్షిగా పుట్టాడు. ఒకసారి గ్రద్దగా పుట్టాడు. ఏడుసార్లు కుక్కగా జన్మించాడు. చివరికి మిథిలా దేశ రాజభవనంలో ఒక బల్లిగా పుట్టి, 87 ఏళ్ల పాటు అక్కడే గోడల మీద తిరుగుతూ గడిపాడు.
ఒకరోజు మిథిల రాజు శ్రుతకీర్తి దగ్గరకు శ్రుతదేవ మహాముని వచ్చారు. రాజు ఆ మునిని గౌరవించి, ఆయన పాదాలు కడిగి ఆ పవిత్ర జలాన్ని తన తలపై జల్లుకున్నాడు. ఆ సమయంలో కొన్ని నీటి చుక్కలు గోడ మీద ఉన్న బల్లిపై పడ్డాయి. ఆ పుణ్య జల స్పర్శతో బల్లికి వెంటనే పూర్వజన్మల గుర్తులు గుర్తొచ్చాయి. అది మనిషిలాగా మాట్లాడుతూ “మునివర్యా! నన్ను కాపాడండి” అని వేడుకుంది. ఆ ముని తన దివ్యదృష్టితో చూసి ఇలా చెప్పారు: “రాజా! నువ్వు వైశాఖ మాసంలో నీటి దానం చేయలేదు. అలాగే విష్ణు స్వరూపులైన జ్ఞానులను వదిలేసి, అపాత్రులకు దానాలు చేశావు. అందుకే నీకు ఈ గతి పట్టింది. కేవలం జాలి చూపాల్సిన వారిని పూజించడం వల్ల ఫలితం ఉండదు, జ్ఞానాన్ని గౌరవించినప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు.”
బల్లి పడుతున్న బాధను చూసి జాలిపడిన శ్రుతదేవ ముని, తాను వైశాఖ మాసంలో చేసిన వ్రత పుణ్యంలో కొంత భాగాన్ని ఆ బల్లికి ధారపోశారు. వెంటనే ఆ బల్లి రూపం పోయి, హేమాంగదుడు మళ్ళీ తన దివ్య రూపంతో ప్రత్యక్షమయ్యాడు. అందరికీ నమస్కరించి పుణ్యలోకానికి వెళ్ళాడు. పదివేల ఏళ్లు పుణ్యలోకంలో సుఖపడిన తర్వాత, మళ్ళీ ఇక్ష్వాకు వంశంలోనే కాకుత్స్థ మహారాజుగా పుట్టాడు. అప్పుడు తన గురువు మాట విని వైశాఖ వ్రతాన్ని భక్తితో, పద్ధతిగా ఆచరించి చివరకు మోక్షాన్ని పొందాడు. వైశాఖంలో దాహంతో ఉన్నవారికి నీరు ఇవ్వకపోవడం పెద్ద పాపం. దానాలు ఎవరికి పడితే వారికి కాకుండా, యోగ్యులైన వారికి, జ్ఞానులకు ఇవ్వడం వల్ల ఎక్కువ పుణ్యం దక్కుతుంది. రావి చెట్టు, తులసి మొక్కలను వదిలేసి పిచ్చి మొక్కలను పూజించడం ఎంత వ్యర్థమో.. జ్ఞానులను వదిలేసి అపాత్రులను పూజించడం కూడా అంతే వ్యర్థం.
వైశాఖ పురాణం ఆరవ అధ్యాయం సంపూర్ణం.
ఏడోవ అధ్యాయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వైశాఖ పురాణం 1-30 అధ్యాయాలు

వైశాఖ పురాణము (Vaisakha Puranam) లోని అధ్యాయములు:
2వ అధ్యాయం – వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు – వాటి ఫలితములు
3వ అధ్యాయం – వివిధ దానములు – వాటి మహత్యములు
4వ అధ్యాయం – వైశాఖ ధర్మ ప్రశంస
5వ అధ్యాయం – వైశాఖమాస విశిష్టత
6వ అధ్యాయం – జలదాన మహత్యము – గృహగోధికా కథ
10వ అధ్యాయం – దక్షయజ్ఞ నాశము – కామదహనము
11వ అధ్యాయం – రతి దుఃఖము – దేవతల ఊరడింపు
13వ అధ్యాయం – అశూన్య శయన వ్రతము
17వ అధ్యాయం – యమ దుఃఖ నిరూపణము
18వ అధ్యాయం – విష్ణువు యముని ఊరడించుట
19వ అధ్యాయం – పిశాచత్వ విముక్తి
20వ అధ్యాయం – పాంచాలరాజు రాజ్యప్రాప్తి
21వ అధ్యాయం – పాంచాలరాజు సాయుజ్యము
22వ అధ్యాయం – దంతిల కోహల శాపవిముక్తి
23వ అధ్యాయం – కిరాతుని పూర్వజన్మ
27వ అధ్యాయం – కలిధర్మములు – పితృముక్తి
28వ అధ్యాయం – అక్షయతృతీయ విశిష్టత
29వ అధ్యాయం – శునీ మోక్షప్రాప్తి
30వ అధ్యాయం – పుష్కరిణి – ఫలశ్రుతి
శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన వైశాఖ మాసంలో సూర్యోదయ సమయమున నదీస్నానం ఆచరించి, పూజలు, జపాలు, దానాలు భక్తితో నిర్వహించి, వైశాఖ పురాణాన్ని పఠించినవారిపై శ్రీహరి ప్రసన్నుడగును. ఆయన అనుగ్రహంతో భక్తులకు పాప విముక్తి కలిగి, వైకుంఠ ప్రాప్తి సాధ్యమగును. 🙏


